Gas Trouble : గ్యాస్ ట్రబుల్ సమస్యా!.. పరగడుపున ఇలా చేసి చూడండి…

ఉదయం నిద్రలేచిన తరువాత 1లీటరు గోరు వెచ్చని నీళ్ళను తాగాలి. ఇలా చేయటం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. ఈ విధంగా చేయటం వల్ల పెద్ద పేగుల్లో ఉండే మలం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. జీర్ణాశ

Gas Trouble : గ్యాస్ ట్రబుల్ సమస్య అనేది కడుపులో అమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వటం వల్ల వచ్చే వ్యాధి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మానసిక వత్తిడి , రాత్రిళ్ళు ఎక్కవ సమయం నిద్రపోకుండా ఉండటం వంటి వాటి కారణంగా ఈ సమస్య ఎదురువుతుంది. జీర్ణకోశ వ్యవస్ధలో అనేక సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ కూడా ఒకటిగా చెప్పవచ్చు.

ఆహారం తీసుకునే సమయాలను పాటించకపోవటం, వ్యాయామం చేయకపోవటం, ఒత్తిడి, అలసట, ఆహారం సరిగా నమిలి తినకపోవటం, జీర్ణశాయంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్లు, మసాలా దినుసులు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం, కాఫీ,టీలు ఎక్కువగా తాగటం, ఇలాంటి వాటి వల్ల ఎక్కువ మందిలో గ్యాస్ ట్రుబుల్ సమస్య కనిపిస్తుంది.

గ్యాస్ ట్రబుల్ సమస్య వచ్చినప్పుడు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఆకలి లేకపోవటం, తేంపులు రావటం, పొట్టలో గడబిడగా ఉంటం, ఛాతిలో మంట, మలబద్ధకం, కడుపులో మంటతో కూడిన నొప్పి వంటి లక్షణాలు గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్న వారిలో కనిపిస్తాయి. గ్యాస్ ట్రుబుల్ సమస్యతో బాధపడుతున్న వారు కొన్నిజాగ్రత్తలు పాటించటం ద్వారా కొంతమేర దానిని నుండి ఉపశమనం పొందవచ్చు.

ఉదయం నిద్రలేచిన తరువాత 1లీటరు గోరు వెచ్చని నీళ్ళను తాగాలి. ఇలా చేయటం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. ఈ విధంగా చేయటం వల్ల పెద్ద పేగుల్లో ఉండే మలం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. జీర్ణాశయం తేలికవుతుంది. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. చాలా మంది భోజనం చేసే సందర్భాలలో నీళ్ళు తాగటం అలవాటు. ఇలా చేయటం వల్ల జీర్ణరసాలు పలుచగా మారి తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. బోజనం చేసిన 30 నిమిషాల తరువాత మాత్రమే నీళ్ళను తాగాలి.

తీసుకునే ఆహారాన్ని ఒకే సారి ఎక్కవ మొత్తంలో తీసుకోరాదు. ఇలా చేస్తే గ్యాస్ సమస్య వస్తుంది. రాత్రి సమయంలో త్వరగా భోజనం ముగించుకోవాలి. కొద్ది కొద్ది మొత్తంలో ఎక్కవ సార్లు తీసుకోవటం వల్ల గ్యాస్ సమస్యను పోగొట్ట వచ్చు. ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినాలి. దీనివల్ల జీర్ణ వ్యవస్ధపై భారం తగ్గుతుంది. టీ,కాఫీలు మానేయటం మంచిది. నిల్వ పచ్చళ్ళ జోలికి అసలు వెళ్ళ వద్దు. పీచు పదార్ధాలు ఎక్కవగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవటం వల్ల గ్యాస్ సమస్య తగ్గించుకోవచ్చు. కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, చూయింగ్ గమ్ లు నమలడం వల్ల కడుపులో గ్యాస్ భాధ పెరుగుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు