Giloy : వ్యాధులు దరిచేరకుండా రోగనిరోధక శక్తిని పెంచే తిప్పతీగ!
రక్తాన్ని శుభ్రపరిచే గుణాలు తిప్పతీగలో ఉంటాయి. పలు రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగల గుణాలు తిప్పతీగలో ఉంటాయి. కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పకుండా చేయగలదు. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
- Guntupalli Ramakrishna
- Published On : July 28, 2022 / 01:36 PM IST
Giloy
Giloy : తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తగిన మోతాదులో తీసుకుంటే తిప్పతీగ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తిప్పతీగ యొక్క ఔషధ ప్రయోజనాలు చాలా వరకు దాని కాండం లోనే ఉంటాయి, కానీ ఆకులు, పండ్లు, మరియు వేర్లను కూడా కొంత మేరకు ఉపయోగిస్తారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారు చేస్తారు. వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.
రక్తాన్ని శుభ్రపరిచే గుణాలు తిప్పతీగలో ఉంటాయి. పలు రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగల గుణాలు తిప్పతీగలో ఉంటాయి. కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పకుండా చేయగలదు. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో
పోరాడగలవు. అలాగే మీ శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగేలా చేస్తుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని కాస్త బెల్లంలో కలుపుకుని తింటే చాలు అజీర్తి సమస్య పోతుంది. మానసిక ఒత్తిడిని, ఆందోళన తగ్గించటంతోపాటుగా జ్ఞాపకశక్తి పెంచటంలో సహాయపడుతుంది. దగ్గు, జబలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు. కంటిచూపును మెరుగుపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
