Ginger Tea : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ!
అల్లంలో యాంటీ వైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అలెర్జీ సమస్యలను తొలగిస్తాయి. ఉబ్బసం వంటి వాటి నుండి రక్షణగా పనిచేస్తుంది. అల్లం రక్త నాళాలలో తెలిసిన అడ్డంకులను తొలగించేందుకు తోడ్పడుతుంది.
- Guntupalli Ramakrishna
- Published On : July 6, 2022 / 02:22 PM IST
Ginger Tea
Ginger Tea : వేసవి ముగిసి వర్షాకాలంలో ప్రవేశించగానే వాతావరణంలో అనేక మార్పులు వస్తుంటాయి. వర్షాల కారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యల నుండివర్షాకాలంలో బయటి తిండి కారణంగా కడుపు సంబంధిత సమస్యలు ఎదురౌతాయి. ఈ సమస్యల నుండి బయటపడాలంటే అల్లం బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద చెప్తున్నదాని ప్రకారం అల్లంలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అల్లంలో విటమిన్ సి, మెగ్నిషియం వంటి మూలకాలతోపాటు ఎన్నో మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. అల్లం సహజ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అల్లంలో ఉండే ఖనిజాలు, అమినోయాసిడ్స్ రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. కడుపులో ఆమ్లత్వం మరియు మంట వంటి సమస్యలను నివారించవచ్చు. బరువును అదుపులో ఉంచుతుంది. అల్లం టీ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అల్లం టీ వల్ల ఆకలి తగ్గుతుంది. దీంతో మితంగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెద్దగా పెరగరు.
జ్వరం మరియు జలుబును తగ్గించేందుకు అల్లం టీ బాగా ఉపకరిస్తుంది. జలుబు ఎక్కువగా ఉంటే అల్లం టీ తీసుకుంటే త్వరగా ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉదయం నిద్రవగానే వికారం మరియు వాంతి సమస్యతో బాధపడుతుంటే అల్లంటీ తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను దరిచేరకుండా చూసుకోవచ్చు.
అల్లంలో యాంటీ వైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అలెర్జీ సమస్యలను తొలగిస్తాయి. ఉబ్బసం వంటి వాటి నుండి రక్షణగా పనిచేస్తుంది. అల్లం రక్త నాళాలలో తెలిసిన అడ్డంకులను తొలగించేందుకు తోడ్పడుతుంది. కాబట్టి అల్లంటీ తో ఆరోగ్యానికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
అల్లం టీ తయారు చేసే విధానం ; నీరు తగ్గినన్నీ, అల్లం తురుము, నిమ్మరసం అర టీస్పూన్, తేనె టీ స్పూన్ తీసుకోవాలి. నీటిని పొయ్యిపై ఉంచి వేడిచేయాలి. ఇందులో అల్లం తురుము వేయాలి. కాస్తా మరిగాక వడపోయాలి. ఇది కాస్తా గోరువెచ్చగా మారాక తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. రోజుకు రెండు కప్పులు మాత్రమే తాగటం మంచిది. క్రమం తప్పకుండా అల్లం టీ తాగవచ్చు.
