Hot Water : వర్షకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే హాట్ వాటర్!
వేడి నీరు త్రాగడం వలన మన శరీరంలో మెట్బాలిజం పెరుగుతుంది. శరీరంలోని కొన్ని పేరుకుపోయిన కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. కడుపు నొప్పి,తిన్నది అరగని జీర్ణ సమస్యలు ఉన్నసమయంలో వేడినీళ్ళు మంచి ఔషదంగా పనిచేస్తాయి. మలబద్దక సమస్యతో బాధపడుతుంటే రోజులో రెండు సార్లు వేడినీరు తాగటం వల్ల సాఫీగా విరోచనం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : July 23, 2022 / 02:57 PM IST
Hot Wate
Hot Water : వర్షకాలంలో వేడి నీరు తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దరిచేరకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా వర్షకాలంలో జలుబులు, దగ్గు, ఆస్తమా ,అలర్జీలు వంటివి వస్తుంటారు. ఇలాంటి రోగాలను దరి చేరనివ్వకుండా వేడినీరు శరీరాన్నికాపాడుతాయి. కనీసం ప్రతిరోజు ఉదయం రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగటం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుందని వైద్యులు సైతం చెబుతున్నారు.
వేడి నీరు త్రాగడం వలన మన శరీరంలో మెట్బాలిజం పెరుగుతుంది. శరీరంలోని కొన్ని పేరుకుపోయిన కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. కడుపు నొప్పి,తిన్నది అరగని జీర్ణ సమస్యలు ఉన్నసమయంలో వేడినీళ్ళు మంచి ఔషదంగా పనిచేస్తాయి. మలబద్దక సమస్యతో బాధపడుతుంటే రోజులో రెండు సార్లు వేడినీరు తాగటం వల్ల సాఫీగా విరోచనం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు, డయాబెటిక్, షుగర్, ఇంకా ఇలాంటి ఎన్నో జబ్బులతో బాధపడేవారు గోరువెచ్చని నీటిని తీసుకోవం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిస్, షుగర్ వ్యాధి సమస్యతో బాధపడేవారు వేడినీళ్లు తాగితే శరీరం ఉత్తేజితమౌతుంది. వేడి నీటిని తాగటం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అధిక బరువు ఉన్నవాళ్లు మాత్రం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూను తేనె ,లేదా ఒక స్పూను నిమ్మ రసం కలుపుకుని త్రాగడం మంచిది. ఇలా చేయటం ద్వారా బరువు తగ్గవచ్చు.
ఇదంతా ఒక ఎతైతే వర్షకాలంలో సాధారణంగా నీరు కలుషితంగా మారుతుంది. ఇలాంటి నీటిని తాగటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. నదులు, చెరువులు, కాలువలు, కుంటలు, బావులు, బోరుబావులు ద్వారా లభించే నీటిలో కంటికి కనపడని బ్యాక్టీరియా, ప్రాణాంతక రసాయనాలు, క్లోరిన్ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇలాంటి నీటిని వేడి చేయకుండా అలాగే తాగడం వల్ల డయేరియా, డీ-హైడ్రేషన్, కలరా వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. నీటి శుభ్రత లోపం వల్ల 250 రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వర్షకాలంలో గోరువెచ్చని నీటిని తాగటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుంది.
