Tamarind
Tamarind : ఇటీవలి కాలంలో అధిక బరువు అన్నది పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు వివిధ రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. అలాంటి వారు సులభంగా బరువు తగ్గేందుకు మీ వంటిట్లో లభించే చింతపండు ఎంతో ఉపయోగకరంగా చెప్పవచ్చు.. వంటగదిలో లభించే ఈ ఒక సూపర్ పదార్ధంతో నిజంగా బరువు తగ్గవచ్చట. అద్భుతమైన ఆహారంగా చింతపండును చెప్పవచ్చు. ప్రతిరోజు మనం కూరల్లో తప్పనిసరిగా వినియోగిస్తుంటాం…పుల్లటి రుచిని కలిగించే చింతపండులో బరువును తగ్గించే గుణాలు ఉన్నాయంటే చాలా మంది ఆశ్ఛర్యం కలుగక మానదు.
చింతపండు అనేది ఫాబేసి కుటుంబానికి చెందిన ఈ చెట్టు ఉష్ణమండల ఆఫ్రికాకు చెందినది. చింత చెట్టునుండి చింతకాయలు కాస్తాయి. వీటిలో ఉండే గుజ్జు లాంటి పదార్ధాన్నే ప్రపంచవ్యాప్తంగా వంటల్లో వినియోగిస్తుంటారు. చింతపండులో అనేక సహజసిద్ధమైన పోషక విలువలు ఉన్నాయి. ప్రొటీన్, కొవ్వులు, డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ, బి1,బి2,బి3,బి5, బి6, విటమిన్ సి, ఇ, కె,తోపాటుగా, పొటాషియం, జింక్, సోడియం, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం వంటివి కూడా పుష్కలంగా ఉన్నాయి.
బరువు తగ్గడానికి చింతపండు:
1.చింతపండులో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ (హెచ్ సిఎ) ఉంటుంది, ఇది కొవ్వు ఉత్పత్తిని తగ్గిస్తుంది. HCA సిట్రిక్ యాసిడ్‌తో సమానంగా ఉంటుంది. ఈ ఆమ్లం అనేక ఇతర మొక్కలలో కూడా ఉంటుంది, అయితే ఇది చింతపండులో ఎక్కువగా కనిపిస్తుంది. HCA శరీరంలో కొవ్వు నిల్వను ప్రోత్సహించే ఎంజైమ్‌ను నిరోధిస్తుంది. హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ సెరోటోనిన్ న్యూరోట్రాన్స్మిటర్ స్థాయిలను పెంచడం ద్వారా ఆకలిని కూడా అణిచివేస్తుంది. ఎక్కవ సమయం వ్యాయామాలు చేసే సందర్భంలో కొవ్వును సైతం కరిగిస్తుంది. జీవక్రియ రేటుపై పెంచటానికి HCA ఏవిధంగా పనిచేస్తున్నదన్నదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
2. చింతపండు తేలికపాటి ఉదరసంబంధిత సమస్యలను నివారించే మందుగా కూడా పనిచేస్తుంది. చింతపండు రసం పిత్త రుగ్మతలకు చికిత్స చేయడంలో, నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు.
3. చింతపండు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా సాగేలా చేస్తుంది.. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు, పాలీఫెనాల్స్ జీవక్రియను పెంచుతాయి. ఆకలిని తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గటంలో సహాయపడతాయి.
4. ఎక్కవ ఆహారం తినడం వల్ల బరువు అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు ఆహారంలో చింతపండు బాగం చేసుకోవటం వల్ల ఎక్కవగా ఆహారం తినాలనిపించదు. తద్వారా బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
5. చింతపండులో ఉండే విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలను కూడా నిరోధిస్తుంది. ప్రతిరోజూ చింతపండు తీసుకోవడం వల్ల అలర్జీలతో బాధపడేవారికి మేలు చేకూరుతుంది. ఇందులోని క్రిమినాశక గుణాలు శరీరంలో ఇన్ఫెక్షన్స్, ఉబ్బసం, జలుబు మరియు దగ్గును నయం చేయడానికి సహాయపడతాయి.
6. చింతపండు మంచి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు ఎల్‌డిఎల్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ,హెచ్‌డిఎల్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంపొందించటంతోపాటు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అయితే చింతపండును ఎక్కవ మోతాదులో వినియోగించటం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఎదురవుతాయి. కొన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి చింతపడు వాడటం వల్ల మరింత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. వైద్యుల సూచనలు , సలహాలు పాటిస్తూ చింతపండు వాడుకోవటం మంచిది.