Walnut Longevity Death Risk : రోజూ వాల్‌నట్స్ తింటే జీవితకాలం పెరుగుతోంది..!

వాల్ నట్స్ (అక్రోట్లు) తింటున్నారా? అయితే మీ దీర్ఘాయువు పెరుగుతోంది. ప్రతిరోజూ వాల్ నట్స్ తినేవారిలో మరణ ముప్పు తగ్గుతోందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది.

Walnut Reduce death risk : వాల్ నట్స్ (అక్రోట్లు) తింటున్నారా? అయితే మీ దీర్ఘాయువు పెరుగుతోంది. ప్రతిరోజూ వాల్ నట్స్ తినేవారిలో మరణ ముప్పు తగ్గుతోందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా వాల్ నట్స్ తినే వృద్ధుల్లో జీవితకాలం పెరుగుతోందని హార్వర్డ్ నేతృత్వంలోని పరిశోధకులు గుర్తించారు. వాల్ నట్స్ క్రమం తప్పకుండా తినేవారిలో మరణం ముప్పు తక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. వారానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ వాల్‌నట్స్ తీసుకునేవారిలో జీవితకాలాన్ని పెంచుకోవడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయని కనుగొన్నారు.

వారానికి కొన్ని వాల్‌నట్‌లు తినడం ద్వారా దీర్ఘాయువుని పెంచడంలో సాయపడతాయని గుర్తించారు. ఆహార నాణ్యతలేని వారంతా వాల్ నట్స్ తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ Yanping Li అన్నారు. వాల్ నట్స ఆరోగ్యానికి అద్భుతమైన చిట్కాగా ఆయన పేర్కొన్నారు. వారానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువగా వాల్ నట్స్ తినడం వల్ల ఏదైనా అనారోగ్యం వల్ల మరణించే ప్రమాదం 14 శాతం తగ్గిందని గుర్తించారు. అందులో కార్డియోవాస్కులర్ వ్యాధుల (CVD) వంటి గుండె సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదం 25 శాతం తక్కువగా ఉందని గుర్తించారు. వాల్నట్ తినని వారితో పోలిస్తే.. దాదాపు 1.3 సంవత్సరాల ఆయుర్దాయం పెరుగుతుందని తేల్చారు.

Weight Loss : బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే ఈ ఐదింటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి!

వారానికి రెండు నుంచి నాలుగు సార్లు వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు. మొత్తం 13 శాతం మరణ ప్రమాదాన్ని, 14 శాతం తక్కువ హృదయ సంబంధ వ్యాధులతో మరణ ముప్పు తగ్గిందని కనుగొన్నారు. తక్కువగా ప్రోటీన్లు తీసుకునేవారిలో రోజుకు వాల్‌నట్ తినడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో 12 శాతం మరణ ముప్పు, 26 శాతం గుండె వ్యాధులు తక్కువగా వస్తాయని తేల్చారు.

ఈ అధ్యయనంలో భాగంగా నర్సుల హెల్త్ స్టడీ నుంచి 63.6 ఏళ్ల సగటు వయస్సు ఉన్న 67,014 మంది మహిళలు, 1986లో హెల్త్ ప్రొఫెషనల్స్ అధ్యయం నుంచి 63.3 ఏళ్ల వయస్సు గల 26,326 మంది పురుషుల డేటాను పరిశోధకులు పరిశీలించారు. ఈ డేటా ఆధారంగా వివిధ స్థాయిలలో వాల్ నట్ వినియోగం దీర్ఘాయువు పెంచడంలో తోడ్పడుతుందని పరిశోధకులు గుర్తించారు. ఎక్కువ మొత్తంలో వాల్‌నట్స్ తీసుకునేవారు మరింత శారీరకంగా చురుకుగా ఉంటారని గుర్తించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు, తక్కువ ఆల్కహాల్ తీసుకోవడంతో పాటు మల్టీవిటమిన్‌లు తీసుకోనేవారు కూడా వాల్ నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదిగా పరిశోధకులు సూచిస్తున్నారు.

Weight Loss Tips: మీరు బరువు తగ్గాలనుకుంటే, ఇది ఓ మంచి మార్గం.. ఈ 5 డ్రై ఫ్రూట్‌లతో ట్రై చెయ్యండి

ట్రెండింగ్ వార్తలు