Teen Pregnancy (1)
Teen Pregnancy : తెలియని వయస్సులో బాల్య విహాలు, ఇతరత్రా కారణాల వల్ల చాలా మంది అమ్మాయిలు గర్భాన్ని దాలుస్తున్నారు. అయితే ఈవిషయంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తమౌతుంది. దీనికి ప్రధాన కారణం ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులకు పూర్తిస్ధాయిలో అవగాహన లేకపోవటమే. ప్రత్యుత్పత్తి, లైంగిక ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవటం వల్ల చాలా మంది అమ్మాయిలు చిన్నవయస్సులోనే గర్భందాలుస్తున్నారు.
ఇలాంటి పరిస్ధితి వల్ల అమ్మాయిలు జీవితకాలమంతా శారీరక, మానసిక, ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా చిన్న వయస్సులో గర్భందాల్చటం వల్ల పుట్టే పిల్లల్లో సైతం అనేక లోపాలు, దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తున్న ఘటనలు కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్న వయస్సులో గర్భం ధరించే అమ్మాయిలు అనీమియా భారిన పడాల్సి వస్తుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు, నెలలు నిండకుండే బిడ్డ పుట్టటం, ఒత్తిడి, మానసిక ఆందోళనలు వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
ప్రసవం తరువాత పుట్టిన పిల్లల్లో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. తక్కువ బరువుతో పుట్టటం, శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావటం, షుగర్, గుండె సమస్యలు ఇలాంటి వన్నీ పసికందుల్లో చోటుచేసుకుంటున్నాయి. అంతేకాకుండా అనుకోని సందర్భాల్లో పుట్టిన శిశువు గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే చిన్నవయస్సు అమ్మాయిలు గర్భం దాల్చే విషయంలో తల్లిదండ్రులు వెనుకా ముందు ఆలోచించాల్సి ఉంది.