Rice Bran : దీని రహస్యం తెలిస్తే…తప్పనిసరిగా ఈ అయిల్ నే వాడతారు

మీరు గుండె జబ్బుతో బాధపడుతున్నా, గుండె జబ్బుల వచ్చే ప్రమాదంలో ఉన్నా, ఫిట్‌గా ఉండాలనుకున్నా హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైనది.

Rice Bran Oil

Rice Bran : ఇటీవలి కాలంలో వంటింట్లో వాడే నూనెల విషయంలో చాలా పెద్ద చర్చే నడుస్తుంది. వంటకు వినియోగించే అయిల్స్ లో ఏది మంచిది..దేనిని ఉపయోగిస్తే ఆరోగ్యానికి మేలు కలుగుతుందన్న దానిపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వివిధ రకాల వార్తలు అందరిని అయిల్స్ వాడకం విషయంలో గందరగోళానికి నెట్టేస్తున్నాయి. వీటన్నింటిని పక్కన పెడితే ఆరోగ్యప్రయోజనాలు అందిస్తూ, వంటకు అనుగుణంగా ఉపకరించే రైస్ బ్రాన్ అయిల్ వినియోగించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

దీనిని మనం వంటల్లో విరివిగా వినియోగించవచ్చు. వరి ధాన్యం మిల్లు అడించిన సందర్భంలో వచ్చే తవుడు నుండి ఈ అయిల్ ను తీస్తారు. పశువుల దాణాగా తవుడు వినియోగించే విషయం గ్రామీణ ప్రాంతాల వారికి ఇప్పటికే అవగాహన ఉండి ఉంటుంది. గతంలో ఈ తవుడు నుండి తీసే నూనెను సబ్బులు, ఫ్యాటి అమ్లాల తయారీలో మాత్రమే వినియోగించేవారు. ఎందుకంటే అప్పట్లో అయిల్ ప్రాసెసింగ్ విధానంలో సరైన టెక్నాలజీ అందుబాటులో లేకపోవటమే ఇందుకు కారణం. అయితే ప్రస్తుం తవుడు నుండి తీసే రైస్ బాన్ అయిల్ ను రిఫైన్ చేస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం మార్కెట్లో రైస్ బ్రాన్ పేరుతో అనేక బ్రాండ్లు అమ్మకాలు సాగుతున్నాయి.

మీరు గుండె జబ్బుతో బాధపడుతున్నా, గుండె జబ్బుల వచ్చే ప్రమాదంలో ఉన్నా, ఫిట్‌గా ఉండాలనుకున్నా హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన బరువు ,శారీరకంగా చురుకైన జీవితం గడిపేలా చేయటంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో రైస్ బ్రాన్ ఆయిల్ ఎంతగానో మేలు చేస్తుంది. ఇది పాలీఅన్‌శాచురేటెడ్, మోనోశాచురేటెడ్ , సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండే నూనెగా చెప్పవచ్చు. శరీరంలో LDL “చెడు” కొలెస్ట్రాల్‌ను పెరగకుండా చూస్తుంది..

శరీరంలోని ఎల్‌డిఎల్ మరియు హెచ్‌డిఎల్ మధ్య బ్యాలెన్స్ చేస్తూ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలలో సమతుల్యతను కాపాడటంలో దోహదపడుతుంది. హెచ్ డిఎ ల్, ఎల్ డిఎల్ సమతుల్యంగా లేనప్పుడు గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఓరిజానాల్ ఉందని పరిశోధనల్లో తేలింది. తూర్పు ఆసియా దేశాలలో దీనిని హార్ట్ అయిల్ గా పిలుస్తారు. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్ధను బలపరుస్తుంది. అంతేకాకుండా చర్మం కాంతి వంతంగా మారాటానికి ఉపకరిస్తుంది. అయితే వివిధ సమస్యలతో బాధపడేవారు ఆహారపదార్ధాల్లో నూనెలను వాడే విషయంలో వైద్యుల సూచనలు పాటించటం శ్రేయస్కరం.