Chai Seeds
Sabza Nuts : వేసవి తాపాన్ని తగ్గించటంలో సబ్జాగింజలు బాగా ఉపకరిస్తాయి. సబ్జా గింజలను నానబెట్టుకుని పానీయంగా తీసుకుంటే వేసవిలో వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. చాలామంది సబ్జా గింజలను నిమ్మకాయి నీరు , షర్బత్, మిల్క్‌షేక్‌ల వంటి రిఫ్రెష్ డ్రింక్స్‌లలో వేసుకుని తీసుకుంటారు.. వేసవి కాలంలో అధిక వేడికి వచ్చే తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని తాగితే సమస్య తగ్గిపోవడమే కాదు, మానసికంగా ప్రశాంతత పొందవచ్చు. వేసవిలో వడదెబ్బకు చెక్ పెట్టాలంటే.. సబ్జానీళ్లు తాగటం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించొచ్చు. తరచూ డీహైడ్రేషన్కు గురయ్యే వారు సబ్జా పానీయం తాగితే మంచిది. వేసవి కాలంలో రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. వేడి నుంచి తప్పించుకోవాలంటే సబ్జాగింజలు మంచి ఔషధంలా ఉపయోగపడతాయి. సబ్జాగుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు.
సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్ మాదిరిగా తయారవుతాయి. శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి. శరీరంలో తేమ తగ్గి నీరసించిపోయిన వారు ఈ విత్తనాలను రోజూ తీసుకుంటే శరీరంలో తేమను పోనీకుండా నిలిపి ఉంచుతాయి. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.