Chaddannam : వేసవిలో చద్దన్నం తినటం ఆరోగ్యానికి మంచిదా?

చద్దన్నం పేదల ఆహారం అన్న అపొహ చాలా మందిలో ఉంది. అయితే ఇటీవలి కాలంలో కొన్ని ఫైవ్ స్టార్ హోటళ్లు చద్దన్నాన్ని పత్యేకంగా ఆహార ప్రియులకు అందిస్తున్నాయి.

Chaddannam : వేసవిలో చద్దన్నం తినటం ఆరోగ్యానికి మంచిదా?

Chaddanam

Updated On : March 25, 2022 / 11:03 AM IST

Chaddannam : ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీ, దోశ, వడ వంటివాటిని తినేందుకు ప్రస్తుత జనరేషన్ ఆసక్తి చూపిస్తుంది… కానీ మన పూర్వికులు మాత్రం ఉదయం అల్పాహారంగా చద్దన్నం ఎక్కువగా తినేవారు. చద్దన్నం తినే అలవాటు దాదాపు వెయ్యేళ్ల నాటినుండి అలవాటుగా వస్తుంది. మారిన జీవన విధానం, పాశ్చాత్య సంస్కృతి ప్రవేశంతో పాతతరం ఆహారపు అలవాట్లు మారిపోయాయి. నేటికి అనేక మారుమూల ప్రాంతాల్లో ఉదయం చద్దన్నంతోనే రోజును ప్రారంభించే వారు లేకపోలేదు. ముఖ్యంగా వేసవి కాలంలో చద్దన్నం సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వేసవి ఉష్ణోగ్రతలకు ఉదయాన్నే చద్దనం తినటం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే బ్యాక్టీరియా పేగులకు ఎంతో మేలు చేస్తాయి. ఇదే విషయం అమెరికన్ న్యూట్రిషిన్ పరిశోధనల్లో తేలింది.

వివిధ రకరకాల పద్ధతుల్లో చద్దన్నం తయారు చేసుకుంటారు. ఒక్కో ఒక్కో ప్రాంతం వారు ఒక్కో పద్దతిని అనుసరిస్తుంటారు. రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్ది అంటారు. ఒడిశాలో చద్దన్నాన్ని పొఖాళొ అంటారు. వేసవి కాలంలో ముగిసే వరకు పొఖాళొ పేరుతో రోజు ఉదయాన్నే చద్దన్నం తినటం ఇక్కడి వారి సాంప్రదాయంగా వస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పకాలన్నం పేరుతో రోజు ఉదయం చద్దన్నం తింటారు. ఏ పద్ధతిలో తయారు చేసుకున్నా, చద్దన్నం మేలు కలిగించేదేనని అటు ఆయుర్వేద నిపుణులు, ఇటు ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు. ఇది శరీరానికి చలువ చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉద‌యాన్నే చ‌ద్దన్నం, పెరుగు క‌లుపుకుని తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి.

చద్దన్నం పేదల ఆహారం అన్న అపొహ చాలా మందిలో ఉంది. అయితే ఇటీవలి కాలంలో కొన్ని ఫైవ్ స్టార్ హోటళ్లు చద్దన్నాన్ని పత్యేకంగా ఆహార ప్రియులకు అందిస్తున్నాయి. వేసవికాలంలో చద్దన్నం తింటే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. ఎండ వల్ల కలిగే నీరసాన్ని నివారిస్తుంది. చద్దన్నం తింటే శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చద్దన్నం బాగా ఉపయోగపడుతుంది. చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే రక్తహీనత నుంచి బయటపడచ్చు. అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం దివ్యౌషధంలా పనిచేస్తుంది. అధిక రక్తపోటు, మలబద్ధక సమస్యలు దూరమవుతాయి.

ఎక్కువ సమయం ఉల్లాసంగా గడిపేందుకు చద్దన్నం దోహదపడుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు చద్దనంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వేసుకుని తింటే వేడి తగ్గుతుంది. పలు చర్మ వ్యాధుల నుండి చద్దన్నం కాపాడుతుంది. అనేక అనారోగ్య సమస్యలను నివారించటంలో తోడ్పడుతుంది. చద్దన్నంలో లాక్టిక్ యాసిడ్.. ఐరన్, పొటాషియం, క్యాల్షియంగా మారుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. చద్దన్నం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ బి6, బి12ను పొందవచ్చు.