Sprouts : మొలకలను ఉడికించి తినటం మంచిదా? పచ్చిగానే తినాలా?
మొలకల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల లోపల మొక్క ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి.
- Guntupalli Ramakrishna
- Published On : November 17, 2022 / 01:13 PM IST
Sprouts
Sprouts : శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. ఆరోగ్యంగా ఉండటానికి, బరువు పెరగాలనుకున్నా, తగ్గాలనుకున్నా శరీరానికి సరైన మోతాదులో పోషకాలు అందించాలి. మొలకల్లో పిండి పదార్ధాలు, విటమిన్ బి6 సమృద్ధిగా లభిస్తుంది. బరువు తగ్గాలని అనుకొనే వారికీ మంచి ఆహారం. చాలా మంది తమ ఆహారంలో చేర్చుకునే శాఖాహార ప్రోటీన్ మూలాలలో మొలకలు ఒకటి.
గుడ్లు, చికెన్ ఇతర జంతు ఆధారిత వనరులు ప్రోటీన్ యొక్క సాధారణ వనరులు. అయితే చాలా మంది మొలకలు తినడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. మరికొందరికేమో అసలు మొలకలు పచ్చిగా తినాలా, ఉడికించి తినాలా అన్న సందేహం కలుగుతుంది. ఎలా తిన్నా వీటినుండి శరీరానికి పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మొలకెత్తిన విత్తనాలను నీటిలో ఉడికించకుండా ఆవిరిపై ఉడికిస్తే అందులోని పోషకాలు తొలగిపోకుండా ఉంటాయని సూచిస్తున్నారు.
మొలకలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే తొందరగా ఆకలి వేయదు. కడుపు నిండిన భావన ఉంటుంది. మొలకల్లో కొవ్వు,కేలరీలు తక్కువగా ఉండుట వలన బరువు తగ్గే వారికీ మంచి ఆహారం. రాత్రి భోజనంలో మొలకలు తింటుంటే బరువు క్రమేపి తగ్గవచ్చు. ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణమవుతాయి. జీవక్రియలను వేగవంతం చేయటంలో సైతం ఇవి సహయపడతాయయి.
మొలకల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల లోపల మొక్క ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉన్న ఈ దశలోనే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
మొలకలు వాతాన్ని పెంచుతాయి. మొలకలు తిన్న తర్వాత మీకు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వచ్చినట్లైతే వాటిని పచ్చిగా తినొద్దు. ఎక్కువసేపు నానబెట్టాలి. మీరు తినడానికి ముందు ఉడకబటెట్టడం మంచిది. వీటిని తినటం వల్ల బాక్టీరియా బారిన పడినట్లయితే ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపిస్తాయి. డయేరియా, వాంతులు, కడుపు ఉబ్బరం మొదలైనవి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు వాసన వస్తుంటే వాటిని తినకపోవడం మంచిది. లేదంటే వాటిని శుభ్రంగా కడిగి ఆవిరిపై కొద్దిసేపు ఉడికించాలి. ఇలా చేయడం ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం తప్పుతుంది.
