Hereditary Heart Disease : వంశపారంపర్యంగా గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి?
వంశపారపర్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు ఆహారపు అలవాట్లల్లో మార్పులు చేసుకోవాలి. వేయించిన పదార్థాలను, జంక్ ఫుడ్ ను కాకుండా సలాడ్స్, ఫ్రూట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
- Guntupalli Ramakrishna
- Published On : February 19, 2023 / 12:51 PM IST
Hereditary Heart Disease :
Hereditary Heart Disease : ప్రస్తుత పరిస్ధితుల్లో ఏ నిమిషంలో ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గుండె జబ్బులతో మరణిస్తున్నవారి సంఖ్య ఇటీవలికాలంలో బాగా పెరిగింది. గుండె నొప్పి, గుండె జబ్బుల కారణంగా క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శరీరంలో ఇతర అవయవాలు దెబ్బతిన్నా కూడా కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు వైకల్యంతో జీవితాన్ని గడపొచ్చు. కానీ గుండె సంబంధిత సమస్యలు తలెత్తితే మాత్రం ప్రాణాలను పోగొట్టుకోవాల్సిందే.
యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయేందుకు గుండె సమస్యలు కారణమౌతున్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, బీపీ వంటి సమస్యలు వంశపారపర్యంగా చాలా మంది ఉంటాయి. ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మన ఇంట్లో ఉన్న పెద్దలలో గుండె జబ్బులు, గుండెకు స్టంస్ట్స్ వేయడం, బైపాస్ చేయడం వంటివి ఉంటే ఆ సమస్యలు పిల్లలకు కూడా వచ్చే అవకాశం 70 శాతం వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వంశపారపర్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్న వారు ముందు ఎటువంటి సమస్య లేకపోయినా 30 సంవత్సరాల వయసు రాగానే వైద్యున్ని సంప్రదించి వారి సూచన మేరకు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. సంవత్సరానికి ఒక్కసారైనా కార్డియాలజిస్ట్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే రక్తపోటు పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా రక్తంలో అడ్డంకులు ఉంటే మన ఆహారపు అలవాట్లను మర్చుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. కొన్ని సందర్భాల్లో వైద్యుల సూచనమేరకు మందులు వాడడమో, స్టంస్ట్స్ వేయించుకోవడమో చేయాలి. ఇలా ముందుగానే తెలుసుకోవడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు.
వంశపారపర్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు ఆహారపు అలవాట్లల్లో మార్పులు చేసుకోవాలి. వేయించిన పదార్థాలను, జంక్ ఫుడ్ ను కాకుండా సలాడ్స్, ఫ్రూట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ఇవి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడేలా, రక్తపోటు అదుపులో ఉండేలా చేయడంలో పండ్లు, కూరగాయలు తీసుకోవటం మంచిది.
కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాలను తక్కువగా తినాలి. వీటివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా తయారవుతుంది. అన్నాన్నికి బదులుగా రెండు పుల్కాలు, జొన్న రొట్టె వంటి వాటిని తీసుకోవాలి. ఉదయం అల్పాహారాలకు బదులుగా మొలకెత్తిన గింజలను, పండ్ల ముక్కలను, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. వీటితో పాటు వ్యాయామాలు చేయడం, యోగా, ధ్యానం వంటివి చేయాలి.
