It's True, Stress Does Turn Hair Gray
Stress does turn hair gray : ఒత్తిడి.. అనేక వ్యాధులకు మూల కారణమంటారు. సాధారణంగా వయస్సురీత్యా జుట్టు తెల్లబడుతుంది.. ఆరోగ్యకరమైన జుట్టు కోసం అది కామన్.. ఒత్తిడితో బాధపడేవారిలోనూ హెయిర్ పిగ్మంటేషన్ (Hair Pigmentation) సమస్య అధికంగా కనిపిస్తోందని అంటున్నారు వైద్య నిపుణులు. పురుషులు, మహిళలకు సంబంధించి 100 వరకు వెంట్రుకలను సేకరించి వారిలో హెయిర్ పిగ్మంటేషన్‌కు గల కారణాలపై అధ్యయనం చేశారు కొలంబియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. హెయిర్ రాత్రికి రాత్రే తెల్లగా మారిపోయింది. మానసిక ఒత్తిడితోనే జుట్టు రంగు మారిపోతుందని అంటున్నారు.
ఒత్తిడితో బాధపడేవారిలో హెయిర్ కలర్ మారిపోతుందని.. వారిలో ఒత్తిడి స్థాయి క్షీణించనప్పుడు హెయిర్ కలర్ కూడా సాధారణ స్థితికి చేరుకుంటుందని గుర్తించినట్టు రీసెర్చర్లు తెలిపారు. హెయిర్ కలర్ మారడమనేది.. తాత్కాలికమా? లేదా శాశ్వతమా అనేది ముందుగా ఎలుకలపై అధ్యయనం చేశారు. అంతేకాదు.. చాలామందిలో వయస్సు దృష్ట్యా కూడా జుట్టు రంగు మారుతుందని గుర్తించారు. ఒత్తిడికి.. జుట్టు తెల్లగా అవడానికి కారణం ఏంటి? అదేలా దారితీస్తుంది అనేదానిపై పరిశోధకులు గుర్తించారు.
జుట్టు రాలడం సహజమే.. పెరుగుదల ప్రక్రియలో నిరంతరం మారుతుంది. ఫోలికల్స్ తాత్కాలికంగా చనిపోతాయి. మళ్లీ తిరిగి పుడతాయి. అదే ఒత్తిడి హార్మోన్ (Stress Hormones) కారణంగా అది మానసికంగానూ శరీరంపై ప్రభావానికి గురిచేస్తుంది. అందుకే జుట్టు తెల్లబడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఫొలిసిల్ స్థాయి పడిపోవడంతో జుట్టులో ఒక్కసారిగా ఫింగ్మటేషన్ కూడా మారిపోతుందని అంటున్నారు. జుట్టు రాలడానికి కూడా ఒత్తిడే కారణమంటున్నారు. సాధారణంగా జుట్టును మన కళ్లతో చూస్తే పెద్దగా తేడా కనిపించదు.. పరివర్తన కారణంగా జుట్టు రంగులో తేడా కనిపిస్తుంది. అదే హై రెజుల్యుషన్ స్కానర్‌లో చిన్నదిగా జుట్టు కనిపిస్తుంది.. రంగులో కూడా అనేక మార్పులు కనిపిస్తాయి. ఈ అధ్యయనం కోసం రీసెర్చర్లు 14 వాలంటీర్లను వేర్వేరుగా అధ్యయనం చేశారు.
అలాగే ఒక్కొక్కరిలో ఒత్తిడికి సంబంధించి హిస్టరీతో పోల్చి చూశారు. ప్రతివారం వారిలో ఒత్తిడి స్థాయి ఎంత ఉందో లెక్కించమని తెలిపారు. చాలామందిలో ఒకసారి తెల్లగామారిన తర్వాత మళ్లీ సాధారణ స్థితిలోకి వచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. హెయిర్ కలర్ మారినప్పుడు 300 ప్రొటీన్లు కనిపించినట్టు గుర్తించారు. దీన్ని మ్యాథమ్యాటికల్ మోడల్ ఆధారంగా రీసెర్చర్లు గుర్తించారు. మైట్రోకాండ్రియాలో మార్పు కారణంగానే జుట్టు తెల్లగా మారుతుందని అంటున్నారు. అందుకే లైఫ్ స్టయిల్ మార్చుకోవాలని, ఒత్తిడిని తగ్గించుకునే దిశగా ప్రయత్నించాలని చెబుతున్నారు. బయోలాజికల్‌గా పరిశీలిస్తే.. వయస్సుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణమవుతాయని గుర్తించారు.