Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఉసిరి దీపం .. నవగ్రహ దోషాల హరణం

కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు ఉసిరికాయకు వున్న సంబంధం అంతా ఇంతా కాదు. ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం.శివకేశవులతో పాటు బ్రహ్మ, సకల దేవతలో ఉసిరి చెట్టులో కొలువై ఉంటే అద్భుత వృక్షం.

Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఉసిరి దీపం .. నవగ్రహ దోషాల హరణం

Usiri deepam in Kartika masam

Karthika Masam..Usiri deepam : కార్తీక మాసం అంటే దీపాలు ప్రధానమైనవి. పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి వాటిని అరటి డొప్పల్లో పెట్టి వెలిగిస్తారు. వేకువ జామునే లేచి చన్నీటి స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక దీపాలు అంటే సాధారణంగా ఒత్తులతో చేసి వెలిగించేవే. కానీ కార్తీక మాసంలో ‘ఉసిరి దీపాలు’లకు విశిష్టత ఉంది. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనాలు చేస్తే మంచిదని అందరికి తెలుసు..కానీ ఉసిరి కాయ (రాసి ఉసిరి అంటే పెద్ద ఉసిరి)తో దీపాలు పెడితే అన్ని శుభాలు కలుగుతాయని..నవ గ్రహ దోషాల పరిహారం జరుగుతుందని చాలామందికి తెలియదు.

ఉసిరి కాయ గుండ్రంగా ఉంటుంది. దానితో దీపం ఎలా పెట్టాలి..? అనేది పెద్ద సందేహమే వస్తుంది. మరి ఉసిరికాయతో దీపం ఎలా పెట్టాలి..ఉసిరి దీపంతో ఎటువంటి పరిహారాలు కలుగుతాయి..? ఉసిరి దీపంతో ఎటువంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..

Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తారు..?

కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు ఉసిరికాయకు వున్న సంబంధం అంతా ఇంతా కాదు. ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగానే భావిస్తారు. అంతేకాదు శివకేశవులతో పాటు బ్రహ్మ, సకల దేవతలో ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు. అంతటి విశిష్టత కలిగిన ఉసిరికి కార్తీక మాసంలో చాలా చలా విశిష్టమైన స్థానం ఉంది. అందుకే కార్తీక మాసంలో మరీ ముఖ్యంగా దశమి, ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి కాయ దీపం వెలిగిస్తే గొప్ప ప్రయోజనాలు కలుగుతాయట.

Karthika Masam 2023 : కార్తీక దీపాలను నీటిలోనే ఎందుకు వదులుతారు..?

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకుని, దాని మద్యలో గుండ్రంగా కట్ చేస్తే..దీపంలో తయారవుతుంది. ఆ బెజ్జంలో నెయ్యి నింపి దాంట్లో తామర కాడల వత్తులను వేసి దీపం వెలిగించాలి. ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారు. సకల ఐశ్వర్యాలతో పాటు మహిళలు సుమంగళిగా మరణిస్తారని అంటారు. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే.. నవగ్రహ దోషాలతో పాటు సకలదోషాలు తొలగిపోతాయని..ఇంటికి నరదిష్టి తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.