Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తారు..?

కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తారు..? దీని వెనుకున్న శాస్త్రం ఏంటీ..సైన్స్ పరంగా ఎటువంటి కారణాలున్నాయి..? బ్రహ్మ విష్ణు,మహేశ్వర రూపాలు కొలువైన ఈ వృక్షంలో ఉండే విశిష్టతలేంటీ..

Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తారు..?

Kartika masam,Vana Bhojanaalu

Kartika masam Vana Bhojanaalu Usiri chettu : కార్తీక మాసం అంటే కార్తీక దీపాలు..వనభోజనాలు గుర్తుకొస్తాయి. వనభోజనాలు అంటే ఉసిరి చెట్టే గుర్తుకొస్తుంది. కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద కూర్చుని భోజనాలు చేయటం హిందూ సంప్రదాయంలో ఆచారంగా వస్తోంది. హిందు పండుగలకు ఆరోగ్య రహస్యాలకు నిలయం అనే విషయం ప్రతీ పండుగలోను కనిపిస్తుంది. ఆరోగ్యాలను ఆచారాలుగా మార్చిన ఘనత మన పూర్వీకులది. సైన్స్ ను నమ్మినట్లుగా చాలామంది శాస్త్రాన్ని నమ్మరు. అదో మూఢత్వమని..వట్టి మూఢనమ్మాకాలని కొట్టిపారేస్తుంటారు. కానీ సైన్స్ నే శాస్త్రంగా..దాన్ని భక్తిగా నమ్మించి అనుసరించేలా చేయటం మన పూర్వీకుల గొప్పతనం అని చెప్పి తీరాలి.

దీంట్లో భాగంగా కార్తీక మాసంలో పూజలు,స్నానాలు, దీపాలు, ఉసిరి చెట్టుకింద భోజనాలు వంటి సంప్రదాయంగా మార్చారు. అసలు ఈ భూమ్మీద ఎన్నో చెట్లు ఉండగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకిందే భోజనాలు చేయాలనే సంప్రదాయం ఎందుకొచ్చింది..? దీని వెనుక ఉన్న శాస్త్రం ఏంటీ..? సైన్స్ ఏంటీ..ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగా కూడా కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అని చెబుతారు. ఉసిరిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు వృద్దాప్యాన్ని దరిచేరనివ్వవని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అద్భుతమైన ఔషదాల గని ఉసిరి. ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి మంచిది. అటువంటి ఉసిరి చెట్టుని ధాత్రీ వృక్షమని అంటారు. ఉసిరి ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. శ్రీ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన చెట్టు.

Karthika Masam 2023 : కార్తీక దీపాలను నీటిలోనే ఎందుకు వదులుతారు..?

కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించి ఈ చెట్టు నీడలో భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందట. ఈ చెట్టుకింద భోజనాలు చేసే ముందు ఉసిరిచెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని ఉంచి ఉసిరి ఆలతో పూజించాలి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులతో పాటు నాలుగు మూలలు అంటూ మొత్తం ఎనిమిది దిక్కుల్లో దీపాలను వెలిగించి.., చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేసి తరవాత చెట్టునీడలో భోజనాలు చేయాలి.

ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి,కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు, ఉసిరి కొమ్మల్లో సూర్యుడు, చిన్న చిన్న కొమ్మలో సకల దేవతలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకమాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగించటం అత్యంత శుభకరంగా భావిస్తారు. ఈ దీపం కార్తీక దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణువుడు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగి పోవడం తో పాటు దుష్టశక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. నరదిష్టి ఆ ఇంటికి తగలదట.

Karthika Masam 2023 : కార్తీక మాసాన్ని కౌముది మాసం అని ఎందుకంటారు..?
ఒక్క ఉసిరిలోనే ఆరు రకాల రుచులున్నాయి. సి విటమిన్ అత్యధికంగా ఉండే కాయ ఉసిరికాయి. ఉసిరి జీర్ణశక్తిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయటం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అంతేకాదు సామాజిక పరంగా కూడా ఈ వనభోజనాలు పదిమందితో కలిసేలా చేస్తాయి. సామాజిక స్పృహను పెంచుతాయి. ఉసిరికాయల్ని సంవత్సరం అంతా రోజుకు కనీసం ఒక్క కాయ అయినా తింటే ఎటువంటి వ్యాధులు రావని డాక్టర్లు కూడా చెబుతుంటారు. మరి ఇన్ని విశిష్టతలు కలిగినది కాబట్టే ఉసిరికి ఇంతటి ఘనత దక్కింది.