Lychee Fruits : వేసవిలో ఆరోగ్యానికి మేలుచేసే లీచీ పండ్లు

లీచీలో రుటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి మానవ శరీరాన్ని రక్షించడంలో రుటిన్ సహాయపడుతుంది. పొత్తికడుపులోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

Lychee Fruits

Lychee Fruits : వేసవి కాలంలో ప్రారంభంతో చాలా మంది ఆహార ప్రియుల దృష్టిమొత్తం తాజా సీజనల్ పండ్లపై పడుతుంది. వాటిని ఆరగించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వేసవిలో అధిక మోతాదు ఆహారాలు తీసుకోవటం, ముఖ్యంగా వేయించి ఆహారాలను తీసుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించరు. వాటిని తినాలన్న కోరికలు తగ్గుతాయి. అయితే వేసవి సమయంలో తాజా పండ్లను తినటం వల్ల శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందుతాయి. అంతేకాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్ గా, ఎనర్జీగా ఉంచటంలో సహాయపడతాయి.

ముఖ్యంగా వేసవి కాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో లీచీ పండు కూడా ఒకటి చూడటానికి ఎర్రని తోలు కలిగి లోపల తెల్లని జెల్ వలే ఉంటుంది. పుల్లగా, తియ్యగా విభిన్నరుచులలో ఉండే ఈ లీచీ పండును తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. భారత దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ లీచీ పండ్లు వేసవి సమయంలో మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని జ్యూస్ లు, ఐస్ క్రీమ్ లలో తీసుకోవచ్చు. లీచీ పండులో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వేసవిలో అద్భుతమైన పండుగా చెప్పవచ్చు.

లిచీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. లీచీలో అత్యంత సమృద్ధిగా లభించే విటమిన్లలో విటమిన్ సి ఒకటి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, విటమిన్ సి తీసుకోవడం స్ట్రోక్ ప్రమాదాన్ని 42% తగ్గిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలంగా చెప్పవచ్చు. అనేక ఇతర పండ్ల కంటే లీచీస్‌లో పాలీఫెనాల్స్ అధిక స్థాయిలో ఉంటాయి. ఈ పండు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ మరియు మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

లీచీలో రుటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి మానవ శరీరాన్ని రక్షించడంలో రుటిన్ సహాయపడుతుంది. పొత్తికడుపులోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. జపాన్‌లోని అమినో అప్ కెమికల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన లిచీ స్కిన్ , గ్రీన్ టీ యొక్క సమ్మేళనంతో కూడిన మిశ్రమం వ్యాయామం తర్వాత పొత్తికడుపు కొవ్వు, అలసట , మంటను తగ్గిస్తుందని తేలింది. కాలేయ క్యాన్సర్‌తో పోరాడటంలో సహాయపడుతుంది.

లీచీలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. నొప్పి , చికాకు కలిగించే సన్‌బర్న్‌ను నయం చేయడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. లీచీ పండు మంటను తగ్గిస్తుంది. లీచీలో ఫ్లేవనోల్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. వేసవి కాలంలో వచ్చే ఫ్లూ , ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.