Making these mistakes before meals and after meals? Possible digestive problems, overweight problems?
Before Meals And After Meals : మనం ఆహారం శరీరానికి అనేక పోషకాలను అందించటంతోపాటు శక్తిని ఇస్తుంది. అయితే చాలా మందు భోజనానికి ముందు, చేసిన తరువాత తెలిసి తెలియక అనేక పొరపాట్లు చేస్తుంటారు. వీటి కారణంగా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మనం భోజనానికి ముందు, తర్వాత ఏ విధమైన తప్పులు చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాత్రి లేటుగా భోజనం చేసి.. భోజనం చేసిన వెంటనే నిద్ర పోతారు. ఇలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు. రాత్రి నిద్ర కూడ పట్టదు. నిద్రకు ముందు రాత్రి భోజనానికి మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. రాత్రి భోజనం అనంతరం 3 గంటల తరువాతే నిద్రించాలి. దీంతో ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అధిక బరువు సమస్య ఉండదు.
భోజనం చేయగానే వెంటనే టీ తాగుతారు. ఇలా టీ తాగడం వల్ల తేయాకులో ఉండే రసాయనాలు మనం తీసుకునే ఆహార పదార్థాలను విచ్ఛిన్నం కానివ్వవు. దీంతో జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. కనుక భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలను తాగరాదు. కనీసం 30 నిమిషాలు అయినా ఆగాలి. ఆ తరువాత టీ, కాఫీలను తీసుకోవచ్చు. భోజనానికి ముందుగా నీటిని ఎక్కువగా తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. అందుకే భోజనానికి కొంత సమయం ముందు, భోజనం తరువాత కొంత సేపు ఆగి నీళ్లు తాగాలి. కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
భోజనం తిన్న వెంటనే వాకింగ్ చేస్తుంటారు. తిన్న అరగంట తర్వాతే వాకింగ్ చేయాలి. తిన్న వెంటనే వాకింగ్ చేయకూడదు. కొంత సమయం తరువాత వాకింగ్ చేయడం వల్ల మనం తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయడం కూడా ప్రమాదమేనట. అది మన శరీర ఉష్ణోగ్రతను అమాంతం పెంచుతుందట. ఈ క్రమంలో మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో ఉండే జీర్ణక్రియకు ఆటంకం కలిగించినట్టే అవుతుంది. దీంతో ఇది దాని పని సక్రమంగా చేయక లేనిపోని రోగాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ అవుతాయి. తినేటపుడు కడుపుకు బిగుతుగా ఉండే బెల్ట్ లు వంటి వాటిని తీసివేయాలి. ఇలా ఉంటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయట.