Belly Fat : మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకు పోతున్నాయి. ప్రధానంగా పొట్ట బాగంలో కొవ్వులు పేరుకుపోయి పొట్ట పెద్ద సైజుగా కనిపిస్తుంది. దీనివల్ల చూడటానికి ఎబ్బెట్టుగా ఉండటంతోపాటు, ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. పొట్ట దగ్గర అధికంగా కొవ్వు పేరుకుపోతే డయాబెటిస్, గుండె జబ్బులు, ఇతర సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక పొట్ట దగ్గర కొవ్వును కరిగించుకోవాలి. అందుకు నిత్యం కొన్ని కూరగాయలను తీసుకుంటే కొవ్వు త్వరగా కరిగేందుకు అవకాశం ఉంటుంది.
పొట్ట కొవ్వులను కరిగించటంలో పుట్టగొడుగులు బాగా ఉపకరిస్తాయి. శాకాహారులు, మాంసాహారులు పుట్టగొడుగులను ఇష్టంగా తింటారు. కొందరైతే పుట్ట గొడుగులను కాఫీలో వేసి తయారు చేసి తాగుతుంటారు. పుట్టగొడుగులు డయాబెటిస్ సమస్యను తగ్గించడమే కాదు, అధిక బరువును తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే ప్రోటీన్లు మెటబాలిజంను పెరగటంతోపాటు కొవ్వు కరుగుతుంది.
అవకాడో ఫ్రూట్స్‌లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే పీచు పదార్థాలు ఆకలి వేయకుండా చూస్తాయి. అవకాడోలోని మోనోశ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు బెల్లీ ఫ్యాట్‌ను కరిగిస్తాయి. బీన్స్‌ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. కండరాల పెరుగుదలకు దోహదపడటంతోపాటు జీర్ణక్రియ పెరిగేందుకు బీన్స్ ఉపయోగపడతాయి.
పాలకూర,ఇతర ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలు ఏవైనా సరే వాటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి కొవ్వును కరిగిస్తాయి. నిత్యం పాలకూరను తినడం వల్ల కొవ్వు కరుగుతుందట. రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా మధ్యాహ్నం లంచ్‌లో పాలకూర తింటే మంచిది. పొట్ట దగ్గరి కొవ్వు త్వరగా కరుగుతుంది.
గుమ్మడికాయతో కొందరు తీపి వంటకాలను చేసుకుని తింటుంటారు. కానీ అలా కాదు, దీన్ని కూరగాయ రూపంలో తీసుకోవాలి. అలా అయితేనే ఫలితం ఉంటుంది. గుమ్మడికాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే సలాడ్లు, డ్రింక్స్ రూపంలోనూ వీటిని తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా పొట్ట దగ్గరి కొవ్వు త్వరగా కరుగుతుంది.
కాలిఫ్లవర్, క్యాబేజీ, బ్రొకొలిలలో హై క్వాలిటీ ఫైబర్ ఉంటుంది. అలాగే ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. బ్రొకొలిలో ఫైటోకెమికల్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి. కాలిఫ్లవర్ కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. దీంతోపాటు ఆకలి అదుపులో ఉంటుంది. కాలిఫ్లవర్‌లో ఉండే సల్ఫరఫేన్ అనబడే ఫైటో న్యూట్రియెంట్ వాపులను తగ్గిస్తుంది.
మిరపకాయలను తినడం వల్ల కొవ్వు కరుగుతుంది. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం మిరపకాయలను తినడం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. అది క్యాలరీలను ఎక్కువగా ఖర్చు చేస్తుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. ఇక పుచ్చకాయ తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో 82 శాతం నీరే ఉంటుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన అదనపు కొవ్వు నిల్వలను తొలగిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా లభించే పుచ్చకాయల్లో కేలరీలు తక్కువగా లభిస్తాయి.
కీరదోస. ఇందులో దాదాపు 96 శాతం నీరు ఉంటుంది. ఒక కీరదోసలో కేవలం 45 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి కీరదోసను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలగడంతోపాటు పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.