మహిళలు లైంగికంగా ప్రేరణకు గురైతే ఆ విషయాన్ని పురుషులు పసిగట్టగలరని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారీ శ్వాస నుండి ఉబ్బిన బుగ్గల వరకు మహిళలు ‘మూడ్’లో ఉన్నప్పుడు శారీరక మార్పులకు లోనవుతారు. లైంగికంగా ప్రేరేపించే, ప్రేరేపించని మహిళలను వాసన ఆధారంగా పురుషులు చెప్పగలరని కెంట్ విశ్వవిద్యాలయం ఓ అధ్యయనంలో వెల్లడించింది.
ఈ అధ్యయనంలో పరిశోధకులు చెమట నమూనాలతో సహా సమర్పించారు. అంతేకాదు పురుషుల కంటే మహిళలకే లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మగవాళ్లలో సెక్స్ ప్రేరణకు కేవలం రెండు మూడు కారణాలు ఉంటే.. ఆడవాళ్లలో ఏకంగా 237 కారణాలు ఉంటాయని గుర్తించారు.
మహిళల లైంగిక ప్రేరేపణ సంకేతాలు సున్నితంగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నట్లు అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ ఆర్నాడ్ విస్మాన్ వెల్లడించారు. అయితే ఆ సంకేతాలను మగవాళ్లు వెంటనే పసిగట్టగలరని వెల్లడించారు. లైంగిక ఆసక్తి అనేది కళ్ల ద్వారానే తెలుస్తుంది అని వెల్లడించింది అధ్యయనం.
రెండు భిన్న ధ్రువాల మధ్య ఆకర్షణ అనేది కొత్త విషయమేమీ కాదు. స్త్రీకి పురుషుడి మీద ఆశ, పురుషుడికి స్త్రీ మీద కోరిక అనేది సాధారణం. తమ భాగస్వామి ఆకర్షణీయంగా ఉన్నప్పుడు తమలోని సెక్స్ కోరికలు ఎక్కువగా పెరుగుతాయని ఎక్కువ మంది స్త్రీలు చెబుతున్నారు.