Benefits Of Mustard : రక్త ప్రసరణ వ్యవస్ధను మెరుగుపరిచి, ఊపిరితిత్తుల సమస్యలను తొలగించే ఆవాలు! అవాల్లో ఔషధ గుణాలు తెలిస్తే?
ఆవ నూనెను చర్మానికి పట్టించి నలుగు పెట్టి స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అదే విధంగా కొబ్బరి నూనెలో ఆవనూనెను కలిపి జుట్టుకు రాసుకోవడం వల్ల మంచిఫలితం ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : September 22, 2022 / 11:30 AM IST
Mustard
Benefits Of Mustard : మన వంట గదిలో ఉండే పోపుల పెట్టెలో మసాల దినుసుల్లో అవాలు ముఖ్యమైనవి. కూరల తాలింపులో వీటిని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఆవాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఔషధ గుణాలను ఆవాలు కలిగి ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. వీటి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేనప్పటికీ వీటిని వాడకంతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఆవాలలో మెగ్నిషియం, మాంగనీస్, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ తోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. వీటిలో శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు, పీచు పదార్థాలు కూడా ఉంటాయి.
అవాలతో ఉపయోగాలు ;
1. ఆవాల పిండిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. వీటిని వంటలల్లో వాడడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా ఆకలి కూడా పెరుగుతుంది.
2. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు మరుగుతున్న నీటిలో ఆవాల పొడిని వేసి గోరు వెచ్చగా చేసి తాగడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆవాలలో ఉండే సెలీనియం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
3. శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆవాలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ చురుకుగా సాగుతుంది. ఆవాలను దంచి వాపులు, నొప్పులు ఉన్న చోట పట్టు వేస్తే ఉపశమనం లభిస్తుంది.
4. ఉబ్బసం వ్యాధి ఉన్న వారు ఆవాలను చక్కెరతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దంతాల నొప్పి కలిగినప్పుడు వేడి నీటిలో ఆవాలను వేసి కొద్ది సేపు ఉంచి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల దంతాల నొప్పి తగ్గుతుంది.
5. ఆవాల పొడితో జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఆవాల నూనెను జుట్టుకు రాసుకోవడం వల్ల పేలు తగ్గుతాయి. ఆవాల నూనెను వాడడం వల్ల మాడుపై ఏర్పడే కురుపులు తగ్గుతాయి. పులిపిర్ల మీద ఆవాలను నూరి రాస్తూ ఉండడం వల్ల పులిపిర్లు రాలి పోతాయి. ఆవాలను నూరి ఆ మిశ్రమానికి కర్పూరాన్ని కలిపి పై పూతగా రాయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
6. ఆవ నూనెను చర్మానికి పట్టించి నలుగు పెట్టి స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అదే విధంగా కొబ్బరి నూనెలో ఆవనూనెను కలిపి జుట్టుకు రాసుకోవడం వల్ల మంచిఫలితం ఉంటుంది. అర బకెట్ నీళ్లలో ఒక టీ స్పూన్ ఆవ పిండిని వేసి కొద్దిసేపు పాదాలను ఉంచితే పాదాల నొప్పులు తగ్గుతాయి.
7. బరువు తగ్గడానికి ఆవగింజలు ఉపయోగపడతాయి, అవి తక్కువ కెలరీలను కలిగి ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ ఆవగింజలలో 32 కేలరీలను మాత్రమే కలిగి ఉంటుంది.
8. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి తీవ్ర రుగ్మతలను తగ్గించడానికి ఈ పోషక పదార్ధం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ గింజలలో ఉండే మెగ్నీషియం, రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది.
9. ఋతుస్రావం నిలిచిపోయిన సమయంలో ఆవగింజలను తినడం వల్ల మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎముకలకు నష్టం జరగకుండా నిలవరించటంలో సహాయపడతాయి.
10. జీర్ణశయములో వాటిల్లే పెద్దప్రేగు క్యాన్సర్ను ఐసోథియోసైనేట్స్ నిరోధించగలదని ఒక పరిశోధనలో కనుగొనబడింది. ఆవగింజలు ఎక్కువ మొత్తంలో గ్లూకోసినోలట్స్ & మైరోసినాస్ ఎంజైమ్లను కలిగి ఉంటుంది. ఇవి గ్లూకోసినోలేట్లను ఐసోథియోసైనేట్స్లోని విచ్ఛిన్నం చేయటంలో కీలకంగా తోడ్పడతాయి.
