reduce heat and urine infection : ఒంట్లో వేడి ,యూరిన్ ఇన్ఫెక్షన్ ని తగ్గించుకునే సహజసిద్ధమైన మార్గాలివే?

సహజంగా కొంతమంది నీళ్లలోకి చెక్కర కలుపుకొని తాగుతూ ఉంటారు. చక్కెర ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఎసిడిటీ సమస్యను ఇంకా ఎక్కువ చేస్తుంది కానీ తగ్గించదు. మంచినీళ్లు బాగా తాగితే మంచిది.

reduce heat and urine infection :

reduce heat and urine infection : ప్రస్తుతం చాలామంది నీళ్లు తాగితే మాటిమాటికీ మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది అనే ఉద్దేశంతో నీళ్లు తాగకుండా ఉంటారు. దీని కారణంగా శరీరంలోని కణాలు హీట్ ను రెగ్యులేట్ చేసేటటువంటి ప్రాసెస్ అంతా కూడా దెబ్బతింటుంది. సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీలు ఉండాలి. ఈ విధంగా ఉంటూ శరీరంలోని ప్రతి అణువూ వేడిని విడుదల చేస్తూ శరీరాన్ని నిర్దిష్టమైన ఉష్ణోగ్రతలో ఉంచుతుంది. ఇది ఆరోగ్య లక్షణం.

ప్రతి రోజు మంచి నీరు బాగా తాగాలి. నీరు తాగటం ద్వారా శరీరాన్ని నిర్దిష్టమైన ఉష్ణోగ్రతలో ఉంచుకోవాలి. నీళ్లు తాగిన తర్వాత రక్తంలో త్వరగా కలిసిపోయి శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తాయి. ఇలా కాకుండా కూల్డ్రింక్స్ వంటివి తాగితే ఇవి అరగడానికి సుమారుగా గంటలపాటు సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇలాంటివి అస్సలు తీసుకోకూడదు. నీటిని అధికంగా తీసుకోవడానికి ఇబ్బంది పడే వారు  పళ్ళరసాలు తాగాలి. ఇవి శరీరంలో నీటి కంటెంట్ ను పెంచి ఎసిడిటీని తగ్గిస్తాయి. మరియు యూరిన్ ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంటాయి.

సహజంగా కొంతమంది నీళ్లలోకి చెక్కర కలుపుకొని తాగుతూ ఉంటారు. చక్కెర ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఎసిడిటీ సమస్యను ఇంకా ఎక్కువ చేస్తుంది కానీ తగ్గించదు. మంచినీళ్లు బాగా తాగితే మంచిది. మంచి నీళ్లు తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎలాంటి డ్రింక్స్ తాగాల్సిన అవసరం లేదు. నీరు ఎక్కువగా ఉన్న ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. దీని ద్వారానే శరీరాన్ని చల్లబరచవచ్చు.

కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, పుచ్చకాయ జ్యూస్, బూడిద గుమ్మడి రసం, సొరకాయ రసం మరియు కీరదోస వీటన్నింటిలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. మీ కడుపు లో ఉండే ఎసిడిటిని వెంటనే తగ్గిస్తాయి. కాబట్టి పళ్లరసాలు తాగుతూ యూరిన్ ఇన్ఫెక్షన్ ను, శరీరంలో వేడిని, ఎసిడిటీ తగ్గించుకోవచ్చు.