Nostradamus predictions 2021 : 2020 ఏడాది కంటే కొత్త ఏడాది 2021.. వెరీ డేంజరస్ అని ప్రాన్స్‌కు చెందిన ఖగోళ వేత్త, సిద్ధాంతకర్త, నోస్ట్రడామస్ జోస్యం చెప్పినట్టే జరుగుతోందా? కరోనా మహమ్మారి విషయంలోనూ ఆయన చెప్పిందే నిజమైందా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతాడంటూ ఆయన చెప్పిన జోస్యం.. నిజమైంది కూడా. నోస్ట్రడామస్ చెప్పినట్టుగా ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడు. ఇవన్నీ నోస్ట్రడామస్ కరెక్ట్ గానే చెప్పాడా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నమ్మక తప్పడం లేదు.
20వ శతాబ్దంలో ఏం జరుగబోతుందో 400ఏళ్ల కిందటే నోస్ట్రడామస్ ఊహించాడు. ఇప్పటివరకూ నోస్ట్రడామస్ చెప్పిన ఒక్కటీ తప్పుగా రుజువుకాలేదు. ఆయన అంచనా ఇప్పటివరకూ తప్పలేదు. అపోకలిప్స్, జాంబీస్ అంటూ అంతగా భయపెట్టిస్తున్న ఈ 16వ శతాబ్దపు జ్యోతిష శాస్త్రజ్ఞుడు చెప్పిన కొన్ని షాకింగ్ విషయాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ విషయంలో నోస్ట్రడామస్ జోస్యం నిజమైనట్టే… కరోనా విషయంలోనూ నిజమైంది. ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.
మూడో శతాబ్దంలో (Quatrain 81) నోస్ట్రడామస్ చెప్పిన ప్రకారం.. ముక్కుసూటిగా ఉండే వ్యక్తి.. బిడియం లేని మాటకారి.. అగ్రరాజ్యాన్ని ఏలుతాడు. అతడి మాటతీరు, దురుస ప్రవర్తనతో వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తాడంటూ చెప్పుకొచ్చాడు. అంటే.. ట్రంప్ విషయంలో అదే జరిగింది. ట్రంప్ టెంపరితనం.. దురుసు ప్రవర్తనతో డొమెక్రట్లలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.. వాస్తవానికి Nostradamus చెప్పే జోస్యాలన్నీ అస్పష్టంగా ఉంటాయి. అయినప్పటికీ ఎందరో జ్యోతిష్యులు నోస్ట్రడామస్ 2021 చెప్పిన జ్యోసానికి ప్రాముఖ్యతను ఇచ్చారు.
జాంబీస్ అపోకలిప్స్ (బయోవైరస్) :
నోస్ట్రడామస్ 2021లో జరగబోయే వాటిలో (Zombie Apocalypse) గురించి ఆయన జ్యోసం చెప్పారు. అదే.. బయోలాజికల్ వెపన్ వైరస్.. రష్యా ఈ బయోలాజికల్ వెపన్ తయారుచేస్తోందంట.. ఈ వెపన్ నుంచి ఉత్పత్తి అయ్యే వైరస్.. యావత్ ప్రపంచాన్ని అంతం చేస్తుందని జోస్యం చెప్పాడు. అంటే ఒకరకంగా కరోనా వైరస్ లాంటిదే.. ప్రపంచమంతా వ్యాపించి వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుందని చెప్పకనే చెప్పారు.
కొంతమంది యువకులకు ముందుగా ఈ వైరస్ సోకి అక్కడి నుంచి ప్రారంభమవుతుందంట. వారినుంచి ఇతరులకు వైరస్ వ్యాపిస్తుందని అక్కడి నుంచి వైరస్ విజృంభణ కొనసాగుతుందని తన పుస్తకంలో ప్రెడిక్షన్ రాసుకొచ్చారు. అంటే ప్రపంచం అంతం కాబోతుంది అనేందుకు ఇదే సంకేతమా? అనేది ఆందోళన కలిగిస్తోంది.
ప్రకృతి విపత్తులు :
2021 ఏడాదిలో ఒక్కసారిగా వాతావరణంలో భారీగా మార్పులు సంభవిస్తాయంట.. ఈ ఏడాదిలో భారీగా సౌర తుఫాన్లు సంభవిస్తాయంట.. ఈ ప్రళయం నుంచి ఎవరూ తప్పించుకోలేరని Nostradamus హెచ్చరించారు. భూమికి తీవ్రంగా నష్టం కలిగిస్తాయని అన్నారు. భారీగా వాతావరణంలో మార్పులు వస్తాయని చెప్పారు. అలాగే యుద్ధాలు కూడా జరుగుతాయంట..
భారీ తోకచుక్క ఒకటి భూమిపైకి దూసుకొస్తుందంట.. మహా ప్రళయం సంభవిస్తుందంట.. దీని ధాటికి భారీ భూకంపాలు, విపత్తులు, సునామీలు సంభవిస్తాయంట.. అలాగే ఆకాశం నుంచి ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతుందంట.. 2021లో జరుగబోయే ఈ మహా వినాశనం సమయంలో ఆకాశమంతా ఎర్రబారుతుందంట.. ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే మాత్రం భారీ పేలుడు సంభవిస్తుందంట. 1945లో హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే… 15 రెట్లు ఎక్కువ శక్తి ఉత్పన్నమవుతుంది.
కాలిఫోర్నియాలో భారీ భూకంపం :
2021లో భారీ భూకంపం.. కొత్త ప్రపంచాన్ని నాశనం చేస్తుంది Nostradamus చెప్పాడు. కాలిఫోర్నియాను భారీ భూకంపం ప్రళయం సృష్టిస్తుందంట.. పశ్చిమ, లాంబార్డీ ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది.
భారీ ఓడల్లో మంటలు చెలరేగడం భారీ స్థాయిలో విధ్వసం వంటి అనేక భయాందోళన ఘటనలు జరుగుతాయని ముందే ఊహించారు. నవంబర్ 25న బుధుడు ధనుస్సులోకి ప్రవేశిస్తాడు. ఈ కలయిక వల్ల మహా ప్రళయం సంభవిస్తుందని నోస్ట్రడామస్ జోస్యం చెప్పారు. 2021లో రాబోయే విపత్తుల నుంచి బయటపడాలంటే ఆ దేవుడే దిక్కు.. అంతా మంచి జరగాలని కోరుకుందాం..