Water Melon
Water Melon : వేసవి కాలంలో విరివిగా లభించే పండ్లలో మార్కెట్లో ఎక్కవగా కనిపించేంది పుచ్చకాయ. మంచి ఎండల్లో దాహం తీర్చుకునేందుకు పుచ్చకాయలను తీసుకుంటుంటారు. అయితే వాస్తవానికి పుచ్చకాయ దాహం తీర్చటమే కాదు ఆరోగ్య సమస్యలకు ఒక ఔషదంగా పనిచేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. పుచ్చకాయలో వ్యాధినిరోధక శక్తిని పెంచే బీటా కెరొటిన్ , విటమిన్ బి, సిలతో పాటుగా శరీర పనితీరుకు అవసరమైన క్యాల్షియం, పొటాషియం, పాస్పరస్, మెగ్నీషియమ్, అయోడిన్ లు ఎక్కువగా ఉన్నాయి.
దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వంద గ్రాముల పుచ్చముక్కల్లో 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. వేసవి కాలంలో చాలా మంది మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందేందుకు పుచ్చకాయను ఎక్కవగా తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. రోజులో మూడు కప్పుల పుచ్చకాయ రసాన్ని తాగితే మాంసాహారం తినటం వల్ల ఏర్పడిన కొన్ని వ్యర్ధాలు సులువుగా బయటకు వెళ్ళిపోతాయి.
పుచ్చ గింజల్ని ఎండబెట్టి పొడిగా మార్చుకుని దానిని నీటిలో మరిగించి చల్లారిన తరువాత తాగితే కిడ్నీలో రాళ్ళ నుండి ఉపశమనం లభిస్తుంది. రోజుకు ఇలా మూడు సార్లు చేస్తే సరిపోతుంది. పుచ్చకాయ కోసిన తరువాత ఎర్రటి కండ క్రింది బాగంలో ఉండే తెల్లటి కండవంటి పదార్ధం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దానిని ముఖానికి, చర్మాభాగాలకు రుద్దటం వల్ల ఫంగల్ ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. పుచ్చకాయలోని ఎర్రని గుజ్జును సైతం చర్మంపై రుద్దిటం వల్ల మృతకణాలు తొలగిపోతాయి.
అధిక రక్తపోటుతో బాధపడే వారికి పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే అమినో అమ్లాలు గుండెకు రక్త సరఫరా సక్రమంగా ఉండేలా చేయటంలో తోడ్పతాయి. ఏ పండులో లేని విధంగా ఇందులో నీటి శాతం ఎక్కువ. దాంతో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక మూత్రపిండాలు పనిచేయక ఇబ్బంది పడేవారు ఈ పండును తినకపోవడం మంచిది. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలు తగ్గాలంటే పుచ్చకాయ తింటే ఆ సమస్యలు తొలగిపోతాయి.
అన్ని రకాల జ్వరాలకు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం పోతుంది. ఎండిపోయే పెదవులను తడిగా ఉంచుతుంది. జీర్ణ సమ్యతో బాధపడేవారు పుచ్చకాయ ముక్కలపై మిరియాలపొడి, నల్ల ఉప్పు చల్లుకుని తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మొటిమలు, మచ్చలతో బాధపడేవారు వీటి నుండి ఉపశమనం పొందేందుకు పుచ్చకాయను ఎక్కువగా తింటే సరిపోతుంది. తరచూ తలనొప్పి సమస్య బాధిస్తుంటే అలాంటి వారు పుచ్చకాయను జ్యూస్ గా చేసుకుని కలకండ వేసుకుని తాగితే తలనొప్పి నుండి విముక్తి లభిస్తుంది.