Okra : చెడు కొవ్వు కరిగించి, బరువు తగ్గించే బెండకాయ!

బెండకాయలో కేలరీలు తక్కువ ఉంటాయి. బెండకాయల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొవ్వులు కరిగించవచ్చు. హృదయ సంబంధ సమస్యలు దరిచేరవు. చెడుకొవ్వును శరీరం నుంచి బయటకు పంపించి వేయడంలోముఖ్యపాత్ర పోషిస్తుంది.

Okra

Okra : మార్కెట్లో దొరికే కూరగాయల్లో బెండకాయ ఒకటి. దీనిని ఆహారంగా తీసుకోవటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వీటితో ఎన్నో రకాల వంటలు చేసుకుని రుచికరంగా తినవచ్చు. వీటిని తింటే లెక్కలు బాగా వస్తాయని పిల్లలకి పెద్దలు చెబుతుంటారు. బెండకాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. బెండకాయలు తినటం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బెండకాయల్లో ఫైబర్, ప్రోటీన్,ఐరన్, క్యాల్షియం, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉండటంవల్ల శరీరానికి పోషక విలువలు అందుతాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బెండకాయలు ఎంతగానో సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు.

బెండకాయలో కేలరీలు తక్కువ ఉంటాయి. బెండకాయల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొవ్వులు కరిగించవచ్చు. హృదయ సంబంధ సమస్యలు దరిచేరవు. చెడుకొవ్వును శరీరం నుంచి బయటకు పంపించి వేయడంలోముఖ్యపాత్ర పోషిస్తుంది. బెండకాయల్లో ఉండే అధిక శాతం ఫైబర్ కారణంగా కడుపు నిండుగా అనిపిస్తుంది. దీని వల్ల తక్కువ తినటంతో బరువు తగ్గుతారు. గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి బెండకాయలు ఎంతగానో సహాయం చేస్తాయి. బెండకాయలో ఉండే ఫోలేట్, విటమిన్ కె మొదలగునవి రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.

బెండకాయ ల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండడం వలన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహులకు ఇది మంచి ఆహారం. కంటికి సంబందించిన సమస్యలు తగ్గిపోతాయి. బెండకాయను తినటం వల్ల లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. రక్తం త్వరగా గడ్డ కట్టేందుకు ఇందులో ఉండే విటమిన్ కె సహాయపడుతుంది. బెండకాయల్లో ఫ్లేవనాయిడ్స్ , పాలీఫినాల్స్, అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అలసట,నీరసం రాకుండా ఉత్సహం గా ఉండేలా చేస్తాయి. శరీరంలో అనేక జీవక్రియలు సక్రమంగా ఉండేలా తోడ్పడాయి.