Breathing Air : పీల్చే గాలి విషయంలోను జాగ్రత్తలు అవసరమే!

సూర్యోదయానికి ముందు ​ వాతావరణంలో తాజాగా ఉంటుంది. ఆ సమయంలో ఇంటి డోర్లు, కిటికీలు తెరిచి ఉంచితే ఇంటిలోపలి గాలి ​ శుభ్రం అయ్యే అవకాశం ఉంటుంది. గాలి పొల్యూషన్​ కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Breathing Air (1)

Breathing Air : తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లే , పీల్చే గాలి విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు నిపుణులు. సహజంగా చాలామంది తినే విషయంపైనే శ్రద్ధ తీసుకుంటూ వుంటారు. కానీ తరచుగా విస్మరించేది మనం పీల్చే గాలిది స్వచ్చమైనదా కాదా అన్న విషయం. సాధారణంగా ఈ విషయం పైన ఎక్కువగా శ్రద్ధ చూపరు. మనం పీల్చి, వదిలే గాలి, ఇతర కారణాల వల్ల హానికర క్రిములు ఇంట్లో పెరిగే ప్రమాదం ఉంది. చాలారకాల క్రిములు నోటి ద్వారా, ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్తాయి. మాట్లాడడం, తుమ్మడం, దగ్గడం వల్ల గాలిలో క్రిములు చేరతాయి.

నిజానికి, తిండికన్నా, నీటికన్నా గాలి చాలా ముఖ్యమైనది. ఇది లేకపోతే ప్రాణమే లేదు. అనుక్షణం ఆక్సిజన్ మన శరీరంలోని అణువణువుకూ అందాలి. ఇటీవలి కాలంలో వాయు కాలుష్యం కారణంగా అనారోగ్యం, వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. కంటి, చర్మ, శ్వాసకోశ సంబంధ వ్యాదులతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాద కరమైన జబ్బులు వస్తున్నాయి. కల్తీ ఇంధనాల వాడకం, కాలం చెల్లిన వాహనాలను తిరగనివ్వడం వంటి విపరీత చర్యలు. ప్లాస్టిక్కును, పాత టైర్లను, పారిశ్రామిక వ్యర్థాలను, ఇతర చెత్తా చెదారాన్ని జనావాసాల మధ్యే కాల్చడం వల్ల కూడా గాలి కలుషితమౌతోంది.

సూర్యోదయానికి ముందు ​ వాతావరణంలో తాజాగా ఉంటుంది. ఆ సమయంలో ఇంటి డోర్లు, కిటికీలు తెరిచి ఉంచితే ఇంటిలోపలి గాలి ​ శుభ్రం అయ్యే అవకాశం ఉంటుంది. గాలి పొల్యూషన్​ కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే బయట గాలిలో పొల్యూషన్​ తగ్గించి, గాలి క్వాలిటీని పెంచాలి. స్వచ్ఛమైన గాలిని మాత్రమే శరీరానికి అందేలా చూసుకోవాలి.

నాసికా రంధ్రాల ద్వారా దీర్ఘమైన శ్వాస తీసుకోవడం వంటి ప్రాణాయామం వల్ల సాంప్రదాయ శ్వాస పద్ధతులను నేర్చుకోవచ్చు. దీనివల్ల ఊరిపితిత్తులకు మేలు కలుగుతుంది. కాలుష్య రహితమైన గాలి పీల్చేందుకు ముక్కులకు మాస్క్ లను ధరించటం కొంత వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం మంచి మాస్క్ లను ఎంచుకోవటం మంచిది. ఏది ఏమైన వివిధ రకాల అనారోగ్యాల బారిన పడటానికి గాలి కూడా ఒక కారణమని కరోనా రాకతో అందరికి అర్ధమైపోయింది. కాబట్టి పీల్చే గాలి విషయంలోనూ జాగ్రత్తలు పాటించటం మంచిది.