Snooze
Benefits Of Napping : మధ్యాహ్నం భోజనంతో సంబంధం లేకుండా నిద్రపోవడం సర్వసాధారణం. 15 నుండి 20 నిమిషాలు స్వల్పకాలం నిద్రపోవడం శరీరానికి , మనస్సుకు మంచిదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. చురుకుదనాన్ని మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తి ,మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఈ నిద్ర సహాయపడుతుంది. కెఫిన్ తీసుకోవడం కంటే తక్కువ నిద్రపోవడం చాలా మంచిదని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. అయితే, 20-30 నిమిషాల సమయాని మద్యామ్నం సమయంలో నిద్రకు కేటాయించటం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. గంట సమయం నిద్రపోతే మాత్రం గజిబిజీ , చిరాకు వంటి పరిస్ధితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మధ్యాహ్నం పూట ఒక గంట పాటు నిద్రించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపడుతుంది. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, సాధారణ 20 నుండి 30 నిమిషాల మధ్యాహ్న నిద్రించేవారు మెరుగైన నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి కలిగి ఉన్నట్లు తేలింది. ఒత్తిడిని ఎదుర్కోవడమే కాకుండా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించడంతోపాటు సృజనాత్మకతను కూడా పెంచుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో తీసుకునే పవర్ న్యాప్స్ ఒత్తిడిని తగ్గించడంలో మరియు మీ దృష్టిని పునరుద్ధరించడంలో సహాయపడతాయి.
మధ్యాహ్నం నిద్రించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. హార్మోన్ల సమతుల్యతను పెంచుతుంది. మధుమేహం, థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడొచ్చునని నిపుణలు చెబుతున్నారు. సంకల్ప శక్తిని పెంచుకోవచ్చు. మధ్యాహ్నం నిద్ర గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొవ్వును కరిగించడానికి మధ్యాహ్నం నిద్ర మెరుగ్గా పనిచేస్తుంది.
అలాగని మధ్యాహ్నం సమయంలో గంటకు మించి ఎక్కువ సమయం నిద్రించటం వల్ల రాత్రి నిద్రలేమితో బాధపడాల్సి వస్తుంది. మధ్యాహ్నం నిద్ర అనేది అటు చిన్నారులకు ఇటు పెద్దలకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. మధ్యాహ్నం నిద్రపోవాలనుకునే వారు మధ్యాహ్నం 2 గంటలకు ముందు నిద్రపోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీని వల్ల రాత్రిపూట నిద్రపై తక్కువ ప్రభావం ఉంటుంది. 20 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోకుండా అలారం సెట్ చేసుకోవటం మంచిది. నిద్రించడానికి చల్లని, నిశ్శబ్దమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి.