×
Ad

Manifest Your Dream Life : ఇదే నిజమైన మార్పు.. మీ ఆలోచన మారితే… అదృష్టం మారుతుంది: ‘మానిఫెస్ట్ యువర్ డ్రీమ్ లైఫ్’

Manifest Your Dream Life : సక్సెస్ లైఫ్ ఫౌండేషన్ సామాజిక సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని కేవలం రూ.999 మాత్రమే ఫీజుగా అందుబాటులోకి తీసుకువచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

Manifest Your Dream Life

Manifest Your Dream Life : సమాజంలో వ్యక్తుల జీవనశైలిలో స్థిరమైన అంతర్గత మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో సక్సెస్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘మానిఫెస్ట్ యువర్ డ్రీమ్ లైఫ్’ అనే విశిష్ట జీవన మార్పు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం జనవరి 1, 2026 నుంచి ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ యోగా, ట్రాన్స్‌ఫర్మేషన్ కోచ్ డాక్టర్ యోగా నారాయణ ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక యోగిక్ మార్గదర్శక యాత్రగా 21 రోజుల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత పాల్గొనేవారికి ఒక ఏడాది పాటు నిరంతర సహాయం, మార్గదర్శకత్వం అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సాధారణంగా కొన్ని రోజులకే ముగిసిపోయే ప్రేరణాత్మక కార్యక్రమాల కన్నా భిన్నంగా ఈ కార్యక్రమం జీవితంలో నిజమైన మార్పు నిలకడగా కొనసాగేందుకు రూపకల్పన చేసినట్టు తెలిపారు.

వేలాది మందికి మార్గనిర్దేశనం :
డా. యోగా నారాయణ యోగాన్ని కేవలం శారీరక సాధనగా కాకుండా సంపూర్ణ జీవన శాస్త్రంగా భావిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ ప్రాంతానికి చెందిన ఆయన బెంగళూరులోని ఎస్-వ్యాస యోగ యూనివర్శిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అలాగే యోగ శాస్త్రాన్ని శాస్త్రీయంగా అభ్యసించారు. హైదరాబాద్, దుబాయ్ కేంద్రంగా ఆయన వేలాది మందికి యోగం, మానసిక స్థిరత్వం, జీవన స్పష్టతపై మార్గనిర్దేశనం చేశారు.

ఈ కార్యక్రమం ప్రారంభ వేడుకను ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ గంపా నాగేశ్వర్ రావు, ఏఐ డిజిటల్ కోచ్ నికీలు గుండా అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యక్తిగత విజయానికి అంతర్గత స్పష్టత, మానసిక సమతుల్యత ఎంత ముఖ్యమో వివరించారు.

కేవలం రూ.999 ఫీజు మాత్రమే :
సక్సెస్ లైఫ్ ఫౌండేషన్ సామాజిక సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని కేవలం రూ.999 మాత్రమే ఫీజుగా అందుబాటులోకి తీసుకువచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఆర్థిక పరిమితులు వ్యక్తిగత అభివృద్ధికి అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తక్కువ ఖర్చుతో అందిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక, జీవన మార్పు కార్యక్రమాలు నిర్వహించి వేలాది మందికి లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు.

పని చేసే వృత్తిపరులు, వ్యాపారవేత్తలు, గృహిణులు, విద్యార్థులు సహా జీవితం పట్ల స్పష్టత, శాంతి, స్థిరత్వం కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే నాణ్యమైన మార్గదర్శకత్వం కోసం పాల్గొనేవారి సంఖ్యను పరిమితంగా ఉంచుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం mysuccesslife.in / 7799500019 వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలని నిర్వాహకులు కోరారు.