Cancer : క్యాన్సర్ కారణంగా ఎదురయ్యే అలసటతో బాధపడుతున్నారా? దాని నుండి బయటపడేందుకు నిపుణుల చిట్కాలు ఇవే!

క్యాన్సర్ అలసట వల్ల ఎదురయ్యే , నొప్పి, వికారం మరియు నిరాశ వంటి లక్షణాలను అధిగ మించటానికి వ్యాయామం మీ మనస్సు, శరీరానికి విశ్రాంతినిస్తుంది, ఇది ఒత్తిడిని తగ్గించడానికి, ప్రశాంతంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది.

Cancer : క్యాన్సర్, క్యాన్సర్ చికిత్స ఒకరి శారీరక మరియు మానసిక శ్రేయస్సుపై ప్రభావం చూపుతాయి. చివరకు అది క్యాన్సర్ సంబంధిత అలసటకు దారితీస్తుంది, తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ శారీరక, మానసిక అలసటకు గురియ్యే అవకాశాలు ఉంటాయి. ఈ అలసట అన్నది దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. కొంతమంది దీనిని అనుభవించే ఉంటారు. క్యాన్సర్ నుండి తిరిగి కోలుకున్న తర్వాత కూడా నెలలు లేదా సంవత్సరాలపాటు ఈ అలసట అన్నది కొనసాగుతుంది.

క్యాన్సర్ మరియు దాని చికిత్సలలో అత్యంత సాధారణ సమస్యలలో క్యాన్సర్ సంబంధిత అలసట కూడా ఒకటి. క్యాన్సర్ అలసటతో బాధపడేవారు మంచంపై నుండి లేవడం, నడవడం, కూర్చోవడం, తినడం , నిద్రపోవడం కూడా కష్టమవుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చాలా మంది బలహీనంగా మారి, అలసిపోయి, నీరసించిపోతారు. అలసట అకస్మాత్తుగా కనిపిస్తుంది. ఇది రోగి యొక్క మొత్తం శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది, ఎందుకంటే రోగి ఎక్కువ సమయం శారీరకంగా, మానసికంగా అలసిపోతాడు.

క్యాన్సర్, లేదా క్యాన్సర్ చికిత్స కారణంగా వారి రోజువారీ పనులను సులభంగా చేయలేరు. అదేసమయంలో మానసిక కల్లోలాన్ని అనుభవించాల్సి వస్తుంది. వారికి ఇష్టమైన అభిరుచులలో పాల్గొనలేరు, చికిత్సను తట్టుకోలేని పరిస్ధితి ఉంటుంది. నిరాశ,ఆత్రుతగా ఉంటారు. క్యాన్సర్ సంబంధిత అలసట చాలా మందిలో సాధారణం. క్యాన్సర్ అలసట యొక్క కారణాల గురించి నిపుణులు చెబుతున్న మాటలను బట్టి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యునోథెరపీ మరియు సర్జరీ వంటి క్యాన్సర్ చికిత్సలు అలసటను కలిగిస్తాయి.

క్యాన్సర్ అలసట వల్ల ఎదురయ్యే , నొప్పి, వికారం మరియు నిరాశ వంటి లక్షణాలను అధిగ మించటానికి వ్యాయామం మీ మనస్సు, శరీరానికి విశ్రాంతినిస్తుంది, ఇది ఒత్తిడిని తగ్గించడానికి, ప్రశాంతంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది. యోగా మరియు నడక వంటి తేలికపాటి వ్యాయామాలతో సహా శారీరక శ్రమ మీకు మంచి నిద్రను, అనుభూతి కలిగిస్తుంది. భావోద్వేగాలను ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. సమతుల్య ఆహారం కూడా మీకు అలసటను పోగొడుతుంది. శక్తివంతంగా మారుస్తుంది. అలసిపోకుండా ఉండాలంటే ధ్యానం, మసాజ్‌లు మరియు మ్యూజిక్ థెరపీని ఎంచుకోవడం కూడా చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు