Symptoms Of Glucose Spikes : మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ హెచ్చుతగ్గుల సమయంలో కనిపించే లక్షణాలు !

మధుమేహం ఉన్నవారు ఏపనిపై స్పష్టంగా దృష్టిసారించలేరు. రక్తంలో చక్కెర స్థాయిలు మెదడు మందగించడానికి దారితీస్తుంది. మెదడులోని న్యూరాన్‌ల మధ్య సిగ్నల్‌ల వేగం తగ్గుతుంది. ఇది మెదడు పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

Symptoms Of Glucose Spikes

Symptoms Of Glucose Spikes : మధుమేహం ఉన్న వ్యక్తులు తరుచుగా రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులను కలిగి ఉంటారు. ఇది వారి శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ అనేది జీవక్రియ రుగ్మత. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో అసమతుల్యతకు దారితీస్తుంది. అధిక రక్త చక్కెర స్థాయిలు కొంత కాలానికి మూత్రపిండాలు, గుండె ఇతర అంతర్గత అవయవాలకు హాని కలిగిస్తుంది.

READ ALSO : Heart Health : గుండె ఆరోగ్యం కోసం వైద్యులు తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గాలు !

టైప్ 1 లో మధుమేహం, ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను విడుదల చేయటం నిలిపివేసినప్పుడు రక్తంలో చక్కెరను నిర్వహించడానికి బాహ్యంగా హార్మోన్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రక్తంలో చక్కెర పెరిగిన లేదా తగ్గినప్పుడు, మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో అధిక చక్కెర ఉన్నవారిలో దాహం అధికంగా ఉంటుంది. తరచుగా మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల దృష్టి , చర్మ సమస్యలు తలెత్తుతాయి. గ్లూకోజ్ స్థాయిలు తగ్గినప్పుడు, పెరిగినప్పుడు వేగంగా గుండె కొట్టుకోవడం, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం ,ఆకలి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మధుమేహం ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ;

1. మెదడు మందగించటం ; మధుమేహం ఉన్నవారు ఏపనిపై స్పష్టంగా దృష్టిసారించలేరు. రక్తంలో చక్కెర స్థాయిలు మెదడు మందగించడానికి దారితీస్తుంది. మెదడులోని న్యూరాన్‌ల మధ్య సిగ్నల్‌ల వేగం తగ్గుతుంది. ఇది మెదడు పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

READ ALSO : Symptoms of Diabetes : వివిధ వయస్సుల వారిలో మధుమేహం లక్షణాలు ఏవిధంగా ఉంటాయంటే !

2. ఆడవారిలో జుట్టు రాలడం ; బ్లడ్ స్ట్రీమ్‌లో బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అధిక గ్లూకోజ్ స్థాయిలు స్త్రీ శరీరంలో అధిక టెస్టోస్టెరాన్ (పురుష సెక్స్ హార్మోన్) కారణమవుతాయి. తలపై జుట్టు ఊడిపోయి బట్టతలరావటానికి, ముఖంపై వెంట్రుకల పెరుగుదలకు దారితీస్తుంది.

2. గుండెల్లో దడ ; రాత్రి వేళ గ్లూకోజ్ హచ్చుతగ్గులు వల్ల చెమటతో, వికారంగా , గుండె దడదడగా అనిపిస్తుంది. ఉదయం సమయంలో ఈ లక్షణాలు లేకుండా నివారించాలంటే రాత్రి తినే భోజనంలో ఆరోగ్యకరమైన తక్కువ GI ఉండేలా చూసుకోవాలి.

READ ALSO : Prevent Diabetes : మధుమేహం ఎలా నివారించాలి ? ప్రారంభ దశలో ఉంటే ఏంచేయాలి ?

3. చర్మ వ్యాధులు ; గ్లూకోజ్ హెచ్చుతగ్గులు శరీరంలో మంటను పెంచుతాయి. తామర వంటి చర్మ వ్యాధులకు గురైతే పరిస్ధితి మరింత దిగజారుతుంది.

4. అధిక ఆకలి ; ఆహారం తినాలన్న కోరికలు నిరంతరాయంగా కొనసాగుతుంటే ఇది అసమతుల్య చక్కెర స్థాయిలకు సంకేతం. గ్లూకోజ్ హెచ్చుతగ్గులు అదనపు ఇన్సులిన్ మన ఆకలి హార్మోన్లను గందరగోళానికి గురి చేస్తాయి. ఈ పరిస్ధితి నిరంతరం ఆకలిని కలిగిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు