Mouth Washes : నోటి పరిశుభ్రతలో ఉపయోగపడే ఇంట్లో లభించే సహజ సిద్ధమైన మౌత్ వాష్ లు ఇవే!

కొబ్బరి నూనె ఒక యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఆక్సిడెంట్, ఇది మీ నోటికి సూక్ష్మక్రిములు లేకుండా చేయడంలో సహాయపడుతుంది. దంతాలను తెల్లగా, మెరిసేలా ఉంచడంలో సహాయపడుతుంది.

These are the natural homemade mouth washes that are useful in oral hygiene!

Mouth Washes : శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే నోటి పరిశుభ్రత విషయంలో కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఖరీదైన ప్రకటనల ఆధారిత నోటి సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నప్పుడు, అవి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. నోటి పరిశుభ్రతలో మౌత్ వాష్ ఒక ముఖ్యమైన భాగం. నోటిని శుభ్రంగా , సూక్ష్మక్రిములు లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది.

మౌత్ వాష్‌ వల్ల కలిగే ప్రయోజనాలు :

ఫ్లాసింగ్ మరియు బ్రషింగ్ వంటివి నోటి శుభ్రతకు దోమదం చేస్తాయి. కావిటీస్ తగ్గించడంలో సహాయపడుతుంది. దంతాలు ,చిగుళ్ళను బలపరుస్తుంది. శ్వాసను ఫ్రెష్ చేస్తుంది. పళ్ల పై ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తుంది. నోటి పుండ్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. మార్కెట్లో కొనుగోలు చేసే మౌత్‌వాష్‌లు ప్రతి ఒక్కరికీ సరిపోవు, వాటి ఘాటైన రుచి మరియు వాసనలే దీనికి ప్రధాన కారణం.

అలాంటి సందర్భంలో ఏమాత్రం చింతించకుండా సహజమైన మరియు సురక్షితమైన పదార్థాలను మౌత్ వాష్ గా ఉపయోగించాలి. ఇవి తిన్న ఆహార వాసనను తొలగించడమే కాకుండా , రసాయన రహితమైనవి, సహజమైనవి అందుబాటులో ఉండే చవకైనవిగా చెప్పవచ్చు.

ఇంట్లో లభించే సహజ సిద్ధమైన మౌత్ వాష్ లు ;

ఉప్పు: నోటి పరిశుభ్రత కోసం ఉప్పు అత్యంత ప్రభావవంతమైన , సులభంగా లభించే సహజ నివారణలలో ఒకటి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పును జోడించడం ద్వారా ఉప్పునీటి మౌత్ వాష్ తయారు చేయడం సులభం. బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాస్‌ ఉప్పు నీటిని 4-5 నిమిషాలు పుక్కిలించండి.

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె ఒక యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఆక్సిడెంట్, ఇది మీ నోటికి సూక్ష్మక్రిములు లేకుండా చేయడంలో సహాయపడుతుంది. దంతాలను తెల్లగా, మెరిసేలా ఉంచడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెను మీ వేలి సహాయంతో దంతాలు , చిగుళ్లపై రాసి 2-3 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.

బేకింగ్ సోడా: టీ, కాఫీ ఎక్కువగా త్రాగే వారు , పొగ త్రాగే వారి దంతాల పై మరకలు కలిగి ఉంటారు. బ్రష్ చేసిన తర్వాత బేకింగ్ సోడా మౌత్ వాష్‌ని ఉపయోగించాలి. అర టీస్పూన్ బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి. ఉదయం మరియు సాయంత్రం 4-5 నిమిషాల పాటు మీ నోటిని శుభ్రంగా కడుక్కోవడం వల్ల దంతాలు మెరిస్తూ, దృఢంగా ఉంటాయి.

అలోవెరా: ఇన్ఫెక్షన్‌లను అరికట్టడానికి అత్యుత్తమ మూలికలలో ఒకటిగా పరిగణించబడే వాటిలో అలోవెరా ఒకటి. అలోవెరా ఔషధ గుణాలతో నిండి ఉంది. ఇది బాక్టీరియాను నివారించటంలో సహాయపడుతుంది, కావిటీలను తొలగిస్తుంది. చిగుళ్లలో రక్తస్రావం తగ్గడానికి కలబంద మౌత్ వాష్ ఉపయోగించండి. దీన్ని తయారు చేయడానికి, అర గ్లాసు కలబంద రసాన్ని అర గ్లాసు నీటిలో కలపండి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసిన తర్వాత దీనిని ఉపయోగించండి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు , సలహాలు పాటించటం మంచిది.