Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటంతోపాటు బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. అదనపు కొవ్వులను కరిగిస్తుంది. గ్లాసు గోరు వెచ్చని నీటిలో స్పూను తేనె వేసుకుని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : May 26, 2022 / 07:10 PM IST
Fats
Fat : మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యపరమైన సమస్యలకు కారణమౌతున్నాయి. ముఖ్యంగా అధిక బరువు, స్ధూలకాయం సమస్య చాలా మందిని పట్టిపీడిస్తుంది. దీనికి కారణం శరీరంలో అధికంగా పెరుకుపోయిన కొవ్వులే. మనం ఆహారాల్లో వినియోగించే కొన్ని రకాల పదార్ధాలతోనే శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను సులభంగానే కరిగించుకోవచ్చు. కొవ్వును కరిగించే పదార్ధాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కరివేపాకు ; దీనిలోని పోషకాలు శరీరంలోని వ్యర్ధాలను దూరం చేస్తాయి. చెడు కొవ్వుని కరిగిస్తాయి. ఊబకాయంతో బాదపడే వారు రోజు పది ఆకులను నీళ్లలో కలిపి తీసుకోవాలి. లేదంటే ఉదయాన్నే నమిలితే శరీరంలోని కొవ్వులు కరిగేందుకు అవకాశం ఉంటుంది.
వెల్లుల్లి ; వెల్లుల్లి కొవ్వులు త్వరగా కరిగించటంలో సహాయపడతాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, సల్ఫర్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి.
తేనె ; శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటంతోపాటు బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. అదనపు కొవ్వులను కరిగిస్తుంది. గ్లాసు గోరు వెచ్చని నీటిలో స్పూను తేనె వేసుకుని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పచ్చిమిర్చి ; పచ్చి మిర్చిలోని పోషకాలు హాని చేసే కొవ్వులను కరిగిస్తాయి. డైటింగ్ చేసే వారు కూరల్లో కారానికి బదులుగా పచ్చి మిర్చి వాడితే మంచిది.
దాల్చిన చెక్క ; జీవక్రియల రేటును మెరుగు పరచటంలో దాల్చిన చెక్క కీలకపాత్ర పోషిస్తుంది. దీన్ని తరచుగా తీసుకోవటం వల్ల ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని కొవ్వును కరిగించటానికి దోహదం చేస్తాయి. జీర్ణ వ్యవస్ధకు మేలు కలిగిస్తాయి.
