Facial Smoothing : ముఖ చర్మం నునుపుదనం కోసం ఇలా చేసి చూడండి!…

గుడ్డులోని తెల్లసొనలో కొంచెం పాలపై ఉండే మీగడ, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది.

Facial Smoothing

Facial Smoothing : ఎండవేడి కారణంగా , వయసు పైబడుతున్నవారిలో చర్మం నునుపుదనం తగ్గుతుంది. ఈ సందర్భంలో ముఖం చూసేందుకుకే కాంతివంతంగా ఉండదు. అంతేకాకుండా బయటకు వెళితే కాలుష్యం కారణంగా కూడి ముఖంపై నునుపుదనం తగ్గుతుంది. ముఖంపై జిడ్డు పేరుకుపోతుంది. దీని వల్ల ఇతరత్రా చర్మసమస్యలు వస్తాయి. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని యాంటీ ఏజింగ్‌ ఫేస్‌ మాస్కులు మేలు చేస్తాయి. వీటి ద్వారా కోమలమైన ముఖాన్ని పొందవచ్చు.

చర్మం నునుపు కోసం చిట్కాలు…

ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల పెరుగు, ఆరస్పూన్ తేనె, ఐదారు చుక్కల గ్లిజరిన్ కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడగాలి. వేసవి కాలంలో శనగపిండి సరిపడని శరీర తత్త్వం గలవారు పెసరపిండితో ప్యాక్ వేసుకోవచ్చు.

పుచ్చకాయ రసం, కమలా పండు రసం, మామిడి పండు గుజ్జు, దోసకాయ గుజ్జు… దేనినైనా ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే చర్మం లావణ్యంగా ఉంటుంది. బంతి, చామంతి, గులాబీ వంటి పూల రెక్కలను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేస్తే చర్మం నునుపుదనం సంతరించుకుంటుంది.

బంగాళాదుంపలను ముక్కలుగా తరిగి వాటిని మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేయాలి. ఆ పేస్టును పలుచని వస్త్రంలో పెట్టి గట్టిగా పిండితే రసం వస్తుంది. ఆ బంగాళాదుంప రసంలో దూదిని ముంచి దానితో ముఖాన్ని, మెడ భాగాన్ని బాగా రుద్దుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి.

బాగా మగ్గిన అరటిపండును తీసుకుని దాన్ని సన్నటి ముక్కలుగా తరిగి వాటిల్లో ఒక్కొక్క టీస్పూన్‌ చొప్పున రోజ్‌ వాటర్‌, తేనె, పెరుగు వేసి ఆ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

గుడ్డులోని తెల్లసొనలో కొంచెం పాలపై ఉండే మీగడ, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది.

కొబ్బరిపాలు చర్మానికి రాసుకుంటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కొబ్బరిపాలలో దూదిని ముంచి దానితో ముఖాన్ని, మెడను బాగా రుద్దుకొని, పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పట్టులా మారుతుంది.

అరకప్పు పుల్లటి పెరుగును చర్మానికి రాసుకుని మర్ధన చేయాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం ననుపుగా మారుతుంది.

అరకప్పు ద్రాక్ష పండ్ల గుజ్జుకు , మూడు టీస్పూన్ల నిమ్మరసం, ఒక టీస్పూన్ యాపిల్ గుజ్జు, పావు కప్పు గుడ్డులోని తెల్లసొన కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి.

గింజల్లేని టమోటా గుజ్జు పావు కప్పు, కీరదోస గుజ్జు ఒక టీ స్పూన్, ఓట్ మీల్ పొడి 4 టీ స్పూన్లు, పుదీనా మిశ్రమం ఒక టీస్పూన్ తీసుకుని బాగా కలిపి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.