×
Ad

Valentine Week 2026 : ఫిబ్రవరి 11న ప్రామిస్ డే, ఈరోజన మీ పార్టనర్‌కు ఇలా వాగ్దానం చేయండి.. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు!

Valentine Week 2026 : ఈరోజు ప్రామిస్ డే.. వాలెంటైన్స్ వీక్‌లో జంటలు, ప్రేమికులకు చాలా ప్రత్యేకమైన రోజుగా చెబుతారు. ఎందుకంటే తమ ప్రేమ, భావాలను వ్యక్తీకరించుకోవచ్చు.

  • Published On : February 11, 2026 / 03:45 PM IST

Valentine Week 2026

Valentine Week 2026 : వాలెంటైన్స్ డే ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు. సాధారణంగా వాలెంటైన్స్ వీక్‌లో మొత్తం 7 రోజులు ఉంటాయి. అందులో రోజ్ డే, ప్రామిస్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రపోజ్ డే, హగ్ డే వాలెంటైన్స్ డే. ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. రోజ్ డే దగ్గర నుంచి వాలెంటైన్స్ డే వరకు అన్ని రోజులు ఒకరిపై మరొకరికి ప్రేమను మరింత పెంచుతాయి.

ఈ వారం ప్రామిస్ డే అనేది జంటలకు మాత్రమే కాదు, స్నేహితులు, కుటుంబ సభ్యులు తమ ప్రేమ , ఆప్యాయతను తెలియజేయొచ్చు. ఫిబ్రవరి 11న ఏ రోజు? ప్రామీస్ డే ప్రాముఖ్యత గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫిబ్రవరి 11న ఏ రోజు? :
ప్రతి ఏడాదిలో ఫిబ్రవరి 11న వాలెంటైన్స్ వీక్‌లో ప్రామిస్ డే జరుపుకుంటాం. ఈ రోజున చాలామంది ప్రేమికులు, తమ భాగస్వాములకు లేదా ప్రియమైనవారికి ప్రేమను వ్యక్తపరుస్తూ వాగ్దానాలు చేస్తారు.

వాస్తవానికి, ఈ రోజు కేవలం ప్రేమ సంబంధాలకే పరిమితం కాదు. స్నేహాలు, కుటుంబ సంబంధాలలో నమ్మకం, సాన్నిహిత్యాన్ని పెంచుకునేందుకు కూడా మంచి అవకాశం. ప్రామిస్ డే రోజున చేసే వాగ్దానాలతో దాంపత్య సంబంధాలు మరింత బలపడతాయి.

Read Also : MG Majestor Launch : ఎంజీ మెజెస్టర్ SUV వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 12నే లాంచ్.. ఫీచర్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి.. మార్కెట్ షేక్ అవ్వాల్సిందే..!

ఈ రోజున మీరు ఏం చేయాలంటే? :
మీరు మీ భాగస్వామికి చిన్న చిన్న వాగ్దానాలు చేయవచ్చు. అంటే.. ఎప్పుడూ తనతో ప్రేమగా ఉంటానని, కష్ట సమయాల్లో వారికి తోడుగా ఉండటం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం లేదా మీ సంతోషాన్ని పంచుకోవాలి. మీరు ఈ వాగ్దానాలను కార్డు, నోట్ లేదా నేరుగా మాట్లాడం ద్వారా వ్యక్తపరచవచ్చు. మీ వాగ్దానాన్ని తెలియజేసేందుకు లేటర్ మీద రాయడం వల్ల మీ భాగస్వామికి మీ మీద నమ్మకం కలుగుతుంది.

ప్రామిస్ డేతో బెనిఫిట్స్ ఏంటి? :
ప్రామిస్ డే జరుపుకోవడం వల్ల జీవన సంబంధాలలో నమ్మకం, అవగాహనను పెంపొందిస్తుంది. ప్రేమ అంటే కేవలం భావాల గురించి మాత్రమే కాదు. నిలబెట్టుకోదగిన వాగ్దానాలు చేయడమే. అది ఈ రోజును గుర్తు చేస్తుంది.

మీ పార్టనర్‌కు ఇలా ప్రామీస్ చేయండి :
1. ఎప్పుడు నీతో ప్రేమగా ఆప్యాయతగా ఉంటాను
2. నమ్మకం, నిజాయితీని ఎల్లప్పుడూ కాపాడుతాను
3. కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా ఉందాం.
4. చిన్న చిన్న ఆనందాలను పంచుకుందాం.
5. ఒకరిపై మరొకరు గౌరవభావంతో రిలేషన్ కొనసాగిద్దాం

ఇలా ఒకరినొకరు వాగ్గానం చేయడం ద్వారా వారి జీవితంలో ఆనందమే కాదు ఒకరిపై మరొకరికి ప్రేమాభిమానులు పెరుగుతాయి. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవిస్తారు. ప్రతి క్షణాన్ని ఆనందంగా మార్చుకుంటారు.