Reduce Back Pain
Reduce Back Pain : కార్యాలయాల్లో కుర్చీలో కూర్చుని ఎక్కువ సమయం గడిపేవారిలో స్థిరంగా కూర్చోవడం వల్ల శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. వెన్నునొప్పి, కూర్చునే భంగిమ సరిగా లేకపోవడం వంటివి ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఎక్కువసేపు కూర్చోవడం వెన్ను ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం చూపుతుంది. దీని వల్ల దీర్ఘకాలిక నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుంది. కంప్యూటర్ ముందు ఎక్కువ గంటలు గడిపటం, ఒకేచోట కూర్చోవటం వంటి నిశ్చల జీవనశైలి వల్ల వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనిని తగ్గించుకోవాలంటే కొన్ని చర్యలు చేపట్టటం చాలా ముఖ్యం.
READ ALSO : Make The Back Strong : వెన్నుముకను దృఢంగా మార్చే ఆహారాలు ఇవే!
ఎక్కువ సమయం కూర్చోని ఉండేవారిలో వచ్చే వెన్నునొప్పిని తగ్గించే మార్గాలు ;
1. సరైన భంగిమలో కూర్చోవటం ; వీపుపై ఒత్తిడిని తగ్గించడానికి కూర్చొనే విషయంలో సరైన భంగిమను అనుసరించాలి. వీపును నిటారుగా ఉంచి, భుజాలు సడలించి, పాదాలను నేలపై ఉంచి కూర్చోవాలి. ముందుకు వంగడం లేదా ముందుకు సాగడం వంటివి చేయకూడదు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. సహజ వెన్నెముక వక్రతకు అనుకూలంగా ఉండే ఎర్గోనామిక్ కుర్చీని ఉపయోగించటం మంచిది.
READ ALSO : Back Pain : ఈ వ్యాయామాలు నడుమునొప్పితో పాటు కండరాల నొప్పులను తగ్గిస్తాయ్!
2. రోజువారిగా సాధారణ వ్యాయామాలు ; క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వెన్ను కండరాలు బలోపేతం అవుతాయి. వెన్నెముకను స్థిరీకరించడానికి , వంపులు లేకుండా ఉండటానికి కొన్ని వ్యాయామాలు తోడ్పడతాయి. ఈత, నడక వంటి తక్కువ ప్రభావం కలిగిన ఏరోబిక్ వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వెన్నునొప్పి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
READ ALSO : మనుషుల్లో సాధ్యమేనా? : వెన్నుముక విరిగి కాళ్లు చచ్చుబడిన ఎలుకను మళ్లీ నడిపించిన జర్మన్ సైంటిస్టులు
3. తరచుగా అటు ఇటు కదులుతూ ఉండటం ; కండరాలను సాగదీయడానికి , వీపు వెనుక భాగంలో ఒత్తిడిని తగ్గించడానికి ప్రతి 30 నిమిషాలకు ఒక సారి కూర్చున్న భంగిమ నుండి పైకి లేచి కాసేపు అటు ఇటు నడవాలి. ఇలా చిన్న విరామం తీసుకోవటం వల్ల వెన్ను నొప్పుల నుండి ఉపసమనం పొందవచ్చు. మెరుగైన వెన్నెముక అమరికను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అదే సమయంలో అసౌకర్యాన్ని కలిగించే కదలికలను నివారించాలి.
READ ALSO : Neck Pain : మెడనొప్పికి దారితీసే రోజువారి పొరపాట్లు!
4. నిలబడటం, కూర్చుకోవటం మధ్య సమన్వయం ; కొంత సమయం కూర్చోవడం మరికొంత సమయం నిలబడటం వల్ల నిరంతరం కూర్చోవడం వల్ల వచ్చే వెన్నునొప్పిని గణనీయంగా తగ్గించవచ్చు. స్టాండింగ్ డెస్క్ ను ఉపయోగించటం వల్ల వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా రోజంతా ఒకే పొజిషన్ ను కొనసాగించకుండ చూసుకోవచ్చు. మణికట్టు, మోచేతులు తటస్థ స్థితిలో ఉంచేందుకు, డెస్క్‌పై సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
READ ALSO : Multiple Myeloma : ఎముకల నొప్పులా అయితే మల్టిపుల్ మైలోమా కావొచ్చు ? లక్షణాలు చికిత్సా విధానం
5. నడుముకు ఒత్తిడి తగ్గించటానికి ; ఎక్కువసేపు కూర్చునేవారు వీపు దిగువ భాగంలో మద్దతుగా దిండు వంటి వాటిని ఉంచుకోవటం మంచిది. ఇలా చేయటం వల్ల వెన్నెముక సహజ వక్రతకు మద్దతుగా దిండు లేదంటే టవల్‌ని వెనుకభాగంలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల వెన్నుకపై ఒత్తిడిని తగ్గించవచ్చు. అలాగే వెన్నునొప్పి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
READ ALSO : Back Pain : గర్భదారణ సమయంలో వెన్నునొప్పి బాధిస్తుంటే!
6. బ్యాక్‌రెస్ట్ ఉపయోగించటం ; ఎక్కువ సమయం కూర్చొని ఉండేవారు పొజిషన్‌ను తరచుగా మార్చకుంటే కనీసం బ్యాక్‌రెస్ట్‌ని ఉపయోగించడం ద్వారా వెన్నుముకకు ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు. మీరు కూర్చునే కుర్చీకి సరిపోయే బ్యాక్‌రెస్ట్‌ను ఎంచుకోవాలి. తద్వారా వీపుపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
READ ALSO : Sitting Risks : రోజులో అధిక సమయం కూర్చునే ఉంటున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు…
7. అప్పుడప్పుడు కూర్చునే భంగిమలను మార్చుకోవటం ; ఒకే భంగిమలో ఎక్కువ సమయం కూర్చుకుండా కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవడం, క్రమం తప్పకుండా విరామం తీసుకోవటం వంటి విధానాన్ని అనుసరించాలి. వెన్ను వెనుకభాగంలో ఒత్తిడిని తగ్గించడానికి లేచి నిలబడండి, అటు ఇటు తిరగం వంటివి చేయాలి.
ఈ వ్యూహాలను అమలు చేయడం ద్వారా నిరంతరం కూర్చోవడం వల్ల వచ్చే వెన్నునొప్పిని గణనీయంగా తగ్గించవచ్చు.