Back Pain : ఈ వ్యాయామాలు నడుమునొప్పితో పాటు కండరాల నొప్పులను తగ్గిస్తాయ్!

నడుమునొప్పి ఉంటే వ్యాయామాలు చేయకూడదని నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే వంగటం, లేవటం వంటి వ్యాయామాల వల్ల వెన్నుముక, కండర బంధనాలు, డిస్కులు, పై ఒత్తిడి ఏర్పడుతుంది.

Back Pain : ఈ వ్యాయామాలు నడుమునొప్పితో పాటు కండరాల నొప్పులను తగ్గిస్తాయ్!

These exercises will reduce back pain as well as muscle pain!

Back Pain : కండరాలు బలహీనంగా ఉంటే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. నడుంనొప్పితోపాటు వీపు, కడుపు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి నొప్పులను తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నడుమునొప్పి ఉంటే వ్యాయామాలు చేయకూడదని నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే వంగటం, లేవటం వంటి వ్యాయామాల వల్ల వెన్నుముక, కండర బంధనాలు, డిస్కులు, పై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇలాంటి వ్యాయామాలకు బదులుగా కొన్ని తేలిక పాటి వ్యాయామాలు చేయటం వల్ల మంచి ఫలితం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నడుమునొప్పిని తగ్గించే తేలికపాటి వ్యాయామాలు ;

క్రంచెస్ ; వెల్లకిలా పడుకుని మోకాళ్లను మడిచి, అరచేతులను మెడ వెనకాల పెట్టుకోవాలి. పొట్ట కండరాలను బిగుతుగా చేసి శ్వాస వదులుతూ భుజాలను కాస్త పైకి లేపాలి. రెండు సెకన్లపాటు ఇలాగే ఉంచి తిరిగి యదాస్ధితికి రావాలి. ఇలా పదిసార్లు చేయాలి.

హ్యామ్ స్ట్రింగ్ వ్యాయామాలు ; తొడ వెనుక కండరాలను సాగదీసే హ్యామ్ స్ట్రింగ్ వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. వెల్లకిలా పడుకుని మోకాళ్లను మడుచుకోవాలి. మోకాలును తిన్నగా నెమ్మదిగా తువ్వాలును పైకి కాలితో నెట్టాలి. ఆ సమయంలో కాలి వెనుక భాగం సాగుతున్న భావన కలుగుతుంది. 15 సెకెండ్ల పాటు ఇలాగే ఉండి తరువాత తిరిగి యధాస్ధితికి రావాలి.

సేతు బంధాసనం ; నడుమునొప్పి తగ్గేలా చేయటంలో సేతు బంధాసనం బాగా ఉపకరిస్తుంది. దీని కోసం ముందుగా వెల్లకిలా పడుకొని , మోకాళ్లను మడవాలి. అరచేతులను శరీరానికి రెండువైపులా నేలకు ఆనించాలి. అరికాళ్లు, అరిచేతులు, భుజాలతో నేలను నొక్కతూ నడము భాగాన్ని నిధానంగా పైకి లేపాలి. కొద్ది సమయం అలాగే ఉండి తిరిగి యధాస్ధితి రావాలి. తుంటి భాగాం పైకి లేపే ముందు కడుపు కండరాలను బిగుతుగా చేసుకోవాలి.

ఈ వ్యాయామాలతో నడుం నొప్పి నుండి కొంత మేర ఉపశమనం పొందవచ్చు. నడుంనొప్పి మరింత తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి. అనంతరం తగిన చికిత్స పొందాలి.