Working Mothers : పని చేసే తల్లులు సాధారణంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఇవే ?

తల్లులను ప్రభావితం చేసే అనేక సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, నిద్ర లేమి, ఒత్తిడి, నిరాశ వంటి ఆరోగ్య సమస్యలను నిరంతరం చాలా మంది తల్లులు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

Working Mothers

Working Mothers : భారతీయ సమాజంలో ఇంటిపని, వంటపనితోపాటు, పిల్లల పెంపకం బాధ్యతలన్నీ మహిళలపైనే ఉంటుంది. వీటి కారణంగా తల్లులు ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటారు. ఒక విధంగా చెప్పాలంటే భారతీయ స్త్రీలు సాంప్రదాయకంగా ఇల్లు, కుటుంబానికి ప్రధాన సంరక్షకులుగా కీలకపాత్ర పోషిస్తారు.

READ ALSO : Cupping Therapy : నొప్పి, వాపు , కండరాల ఒత్తిడిని తగ్గించటంతోపాటు రక్త ప్రసరణను ప్రోత్సహించే కప్పింగ్ థెరపీ !

అదే క్రమంలో భారతదేశంలోని తల్లుల అనేక ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీసం వాటి గురించి అవగాహన కూడా వారు కలిగి ఉండరు. పనిభారం పెరగటం వల్ల ఈ పరిస్ధితి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

తల్లులను ప్రభావితం చేసే అనేక సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, నిద్ర లేమి, ఒత్తిడి, నిరాశ వంటి ఆరోగ్య సమస్యలను నిరంతరం చాలా మంది తల్లులు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పని చేసే తల్లులను వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

READ ALSO : Plants cry when stressed : ఒత్తిడి ఎక్కువైతే మనుష్యులే కాదు.. మొక్కలు కూడా ఏడుస్తాయట..మీరు విన్నది నిజమే

పని చేసే తల్లులను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యలు ;

1. ఒత్తిడి ; పని చేసే తల్లులను ప్రభావితం చేసే అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యలలో ఒత్తిడి ఒకటి. ఇంటి పని, కుటుంబ కట్టుబాట్లను బ్యాలెన్స్ చేయడం వంటి ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. వీటి వల్ల ఒత్తిడి, ఆందోళన , నిరాశ భావాలకు తల్లులు లోను కావాల్సి వస్తుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు తగినంత విశ్రాంతి తీసుకోవటానికి తగిన సమయం కేటాయించటం అవసరం.

2. నిద్ర లేమి ; పని చేసే తల్లులను ప్రభావితం చేసే మరో సాధారణ సమస్య నిద్ర లేమి. సుదీర్ఘ పని గంటలు, ఇతర కట్టుబాట్లతో కలిపి, నిద్ర సరిగా లేకపోవటం, అలసటకు దారితీస్తుంది. నిద్ర లేమిని తగ్గించుకోవటానికి సమయం ప్రకారం నిద్రపోవాలి. పడుకునే ముందు మొబైల్ గ్యాడ్జెట్స్ వంటి వాటితో గడిపే సమయాన్ని పరిమితం చేయాలి.

READ ALSO : ఒత్తిడికి గురవుతున్నారా?

3. పోషకాహార లోపాలు ; పని చేసే తల్లులు వారి కుటుంబసభ్యులకు ఆరోగ్యకరమైన ఆహారాలను సిద్ధం చేయడానికి సమయాన్నికేటాయిస్తారు. వారు మాత్రం సరైన ఆహారాలను తీసుకోరు. దీంతో పోషకాహార లోపాలను ఎదుర్కొంటారు. ఆహారంలో తాజా పండ్లు,కూరగాయలు పుష్కలంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి.

4. శారీరక ఆరోగ్య సమస్యలు ; పని చేసే తల్లులు రోజువారి వ్యాయామానికి, శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి పరిమిత సమయాన్ని కేటాయిస్తారు. శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవటంలో వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి.

READ ALSO : Pressure On The Eyes : ఈ పనులు చేసే సందర్భంలో కంటిపై ఒత్తిడి పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

5. మానసిక ఆరోగ్య సమస్యలు ; పని చేసే తల్లులలో ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు సాధారణంగా ఎదురవుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు తగిన సమయాన్ని కేటాయించాలి. యోగా వంటి పద్ధతులను సాధన చేయడం ద్వారా వాటిని దూరం చేయవచ్చు.