Pressure On The Eyes : ఈ పనులు చేసే సందర్భంలో కంటిపై ఒత్తిడి పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

కంప్యూటర్ తెర మధ్యబాగానికి చూపు ఉండేలా చూసుకోవాలి. పనిచేసేటప్పుడు రెప్పలు ఆర్పుతూ ఉండాలి. కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. దృష్టి తీక్షణంగా ఉండకూడదు.

Pressure On The Eyes : ఈ పనులు చేసే సందర్భంలో కంటిపై ఒత్తిడి పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

Pressure On The Eyes :

Pressure On The Eyes : కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ మధ్య కాలం చిన్న వయస్సులోనే చాలా మందికి దృష్టి లోపం ఏర్పడుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంటి నుండి పని చేస్తుండటం వల్ల మొబైల్, ల్యాప్‌టాప్‌లతో గడపాల్సి వస్తుంది. ఆసమయంలో కంటి సంరక్షణ అనేది చాలా అవసరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో కంటిపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు పాటించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసకునే ప్రయత్నం చేద్దాం..

పుస్తకాలు చదివే సందర్భంలో ; పుస్తకాలు రోజువారిగా చదివే వారు పుస్తకం 30సె. మీ. దూరంలో ఉంచుకోవాలి. నిటారుగా కూర్చుని చదవాలి. పడుకుని చదవటం వంటివి చేయరాదు. పుస్తకాలు చదివే సందర్భంలో సరిపడా వెలుతురులో కూర్చోవాలి. కదులుతున్న కుర్చీలో కూర్చుని చదివితే కళ్ళకు శ్రమకలుగుతుంది. దీని వల్ల కంటిపై ఒత్తిడి పడుతుంది.

టివి చూస్తున్న సందర్భంలో : టివి చూసే సమయాన్ని పరిమితం చేసుకోవాలి. గంటల తరబడి టీవికే అతుక్కు పోవటం ఏమాత్రం మంచిది కాదు. ఒక గంటకు మించి టి.వి. చూడటం మంచిది కాదు. టి.వి. చూస్తున్నప్పుడు శరీరాన్ని పలురకాల భంగిమల్లో ఉంచడం చాలమందికి అలవాటు అయితే వెన్నెముకకి ఊతనిచ్చే కూర్చుని టి.వి. చూడటం కోసం వినియోగించటం వల్ల కంటికి మేలు కలుగుతుంది. టి.వి. కి కనీసం 3 మీటర్లు దూరం ఉండాలి. చీకటిగా ఉన్న గదిలో కాకుండా వెలుతురు సరిపడా ఉండే ప్రాంతంలో టి.వి చూడాలి.

కంప్యూటర్ తో పనిచేస్తున్నప్పుడు : కంప్యూటర్ తెర మధ్యబాగానికి చూపు ఉండేలా చూసుకోవాలి. పనిచేసేటప్పుడు రెప్పలు ఆర్పుతూ ఉండాలి. కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. దృష్టి తీక్షణంగా ఉండకూడదు. కాంతి వంతంగా కనిపించేలా మోనిటర్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. మోనిటర్ మీద యాంటీగ్లేర్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుంటే మంచిది.

బండి నడిపేటప్పుడు : పగటిపూట బండి నడిపేటప్పుడు సన్ గ్లాస్ ఉపయోగించాలి. సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు, యు.వి. కిరణాల తాకిడికి కళ్ళకు హాని కలగకుండా దుమ్ము, దూళి పడకుండా కళ్ళకు రక్షణగా ఉంటాయి. రాత్రి సమయంలో వాహనాలు నడిపేసందర్భంలో యాంటీగ్లేర్ గ్లాస్ వాడాలి. ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్ కాంతిని తగ్గించి కళ్ళకు రక్షణ కలిగిస్తాయి.