Smartphones First Sale: ఈ ఖతర్నాక్‌ స్మార్ట్‌ఫోన్లు అన్నీ వారం రోజుల్లో వచ్చేస్తున్నాయ్‌.. ఆర్‌ యూ రెడీ.. 

కంపెనీ వెబ్‌సైట్, అమెజాన్ నుంచి కొనవచ్చు. ఆయా స్మార్ట్‌ఫోన్ల వివరాల గురించి తెలుసుకుందాం..

Smartphones First Sale: ఈ ఖతర్నాక్‌ స్మార్ట్‌ఫోన్లు అన్నీ వారం రోజుల్లో వచ్చేస్తున్నాయ్‌.. ఆర్‌ యూ రెడీ.. 

Smartphones First Sale

Updated On : August 24, 2025 / 2:53 PM IST

Smartphones First Sale: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? వారం రోజుల్లో మార్కెట్లో కొన్ని ఖతర్నార్ స్మార్ట్‌ఫోన్లు సిద్ధంగా ఉండనున్నాయి. రియల్‌మీ నుంచి లావా వరకు పలు కంపెనీల కొత్త స్మార్ట్‌ఫోన్ల వివరాలు చూద్దాం..

రియల్‌మీ పీ4 5జీ

రియల్‌మీ పీ4 5జీ అమ్మకాలు ఆగస్టు 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి. కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఆర్డర్ చేయవచ్చు. దీని 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.18,499, 8జీబీ + 128జీబీ వేరియంట్ రూ.19,499, 8జీబీ + 256జీబీ వేరియంట్ రూ.21,499.

ఈ ఫోన్‌లో 6.77 అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ప్రాసెసర్‌కి డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా ఉంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Also Read: యూపీఎస్సీ రాయలేదు, కోచింగ్ తీసుకోలేదు… అయినా ఐఏఎస్ అయిన పేదింటి యువకుడి కథ ఇది.. సెల్యూట్ సర్..

రెడ్‌మీ 15 5జీ

ఈ ఫోన్ అమ్మకం 28 ఆగస్టు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. కంపెనీ వెబ్‌సైట్, అమెజాన్ నుంచి కొనవచ్చు. 6జీబీ + 128జీబీ వేరియంట్ రూ.14,999, 8జీబీ + 128జీబీ వేరియంట్ రూ.15,999, 8జీబీ + 256జీబీ వేరియంట్ రూ.16,999గా ఉంటుంది.

ఈ ఫోన్ ఫ్రాస్టెడ్ వైట్, మిడ్నైట్ బ్లాక్, సాండీ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. 6.9 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్‌సెట్ ఉంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

లావా ప్లే అల్ట్రా 5జీ

లావా ఈ అల్ట్రా ఫోన్ ఆగస్టు 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. 6జీబీ + 128జీబీ వేరియంట్ రూ.14,999, 8జీబీ + 128జీబీ వేరియంట్ రూ.16,499.

ఇది ఆర్కిటిక్ ఫ్రాస్ట్, ఆర్కిటిక్ స్లేట్ రంగుల్లో లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, 6.67 అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 64 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

రియల్‌మీ పీ4 ప్రో 5జీ

రియల్‌మీ పీ4 ప్రో 5జీ అమ్మకం ఆగస్టు 27 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనవచ్చు. దీని ధరలో 8జీబీ + 128జీబీ వేరియంట్ రూ.24,999, 8జీబీ + 256జీబీ వేరియంట్ రూ.26,999, 12జీబీ + 256జీబీ వేరియంట్ రూ.28,999. దీన్ని బర్చ్ వుడ్, డార్క్ ఓక్ వుడ్, మిడ్నైట్ ఐవి రంగుల్లో కొనవచ్చు.

ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల ఆమోలెడ్ 4డి కర్వ్+ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ఉంది. దీని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్, సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.