Noel Sean : కొత్త ఎలక్ట్రిక్ కార్ కొన్న నోయెల్ సీన్.. అమ్మను ఫస్ట్ కూర్చోపెట్టి.. ఎన్ని లక్షలో తెలుసా?
ప్రస్తుతానికి నోయెల్ పలు సినిమాలు, సాంగ్స్ తో బిజీగానే ఉన్నాడు. తాజాగా నోయెల్ సీన్ కొత్త కార్ కొన్నాడు.(Noel Sean)

Noel Sean
Noel Sean : సింగర్, నటుడు నోయెల్ సీన్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు ర్యాప్ సాంగ్స్ తో కూడా అలరించాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని మధ్యలోనే బయటకు వచ్చేయడంతో అప్పట్లో బాగా వైరల్ అయ్యాడు. ప్రస్తుతానికి నోయెల్ పలు సినిమాలు, సాంగ్స్ తో బిజీగానే ఉన్నాడు. తాజాగా నోయెల్ సీన్ కొత్త కార్ కొన్నాడు.
తన తల్లితో కలిసి నోయల్ సీన్ కార్ ని అందుకున్నాడు. తల్లితో కేక్ కట్ చేయించి కొత్త కార్ కొనుకున్న సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. మహేంద్ర కంపెనీకి చెందిన BE6 SUV మోడల్ ఎలెక్ట్రిక్ కార్ ని కొన్నాడు నోయల్. ఈ కార్ ధర ఆల్మోస్ట్ 20 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. కొత్త కార్ లో మొదట తల్లిని కూర్చోపెట్టి డ్రైవ్ చేసాడు నోయల్. కొత్త కార్ కొన్న సెలబ్రేషన్ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు నోయల్.
Also Read : Pandu Father : మా నాన్న ఆటో డ్రైవర్.. వద్దన్నా ఇంకా అదే ఆటో నడుపుతూ.. ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు..