Jackie Shroff : వామ్మో.. లక్ష రూపాయలు పెడితే వందకోట్లు వచ్చింది.. బాలీవుడ్ స్టార్ హీరో అప్పుల్లో ఉన్నప్పుడు..

బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, అతని భార్య ఆయేషా ష్రాఫ్ కేవలం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి వంద కోట్లు తీసుకున్నారని తెలుసా?(Jackie Shroff)

Jackie Shroff : వామ్మో.. లక్ష రూపాయలు పెడితే వందకోట్లు వచ్చింది.. బాలీవుడ్ స్టార్ హీరో అప్పుల్లో ఉన్నప్పుడు..

Jackie Shroff

Updated On : August 24, 2025 / 12:13 PM IST

Jackie Shroff : సినిమా సెలబ్రిటీలు కేవలం సినిమాల మీదే కాకుండా వివిధ వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెడుతుంటారు. సినిమాలో ఫేమ్ అయిపోయితే సంపాదన కావాలి అని రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, అతని భార్య ఆయేషా ష్రాఫ్ కేవలం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి వంద కోట్లు తీసుకున్నారని తెలుసా?(Jackie Shroff)

1994లో కేంద్ర ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్, టీవీ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇచ్చింది. దీంతో సోనీ ఎంటర్టైన్మెంట్స్ టెలివిజన్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. ఇక్కడ కొన్ని పెట్టుబడులు పెట్టి చూసుకోడానికి టీమ్ కావడంతో వాళ్ళు బాలీవుడ్ ప్రముఖుల వైపు చూసారు. అప్పటికి జాకీ ష్రాఫ్ స్టార్ గా కొనసాగుతున్నాడు. ఈ విషయం తెలిసి జాకీ ష్రాఫ్ భార్య సోనీ వాళ్ళను అప్రోచ్ అయింది. కానీ ఏ సమాధానం లేదు.

Also Read : Pandu Father : మా నాన్న ఆటో డ్రైవర్.. వద్దన్నా ఇంకా అదే ఆటో నడుపుతూ.. ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు..

దీంతో జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ బాలీవుడ్ మొత్తానికి ఒక పార్టీ ఘనంగా అరేంజ్ చేసారు. అది రాత్రి నుంచి తెల్లారిదాకా సాగుతూనే ఉంది. దీని కోసం బాగానే ఖర్చుపెట్టారు అప్పట్లో. ఈ విషయం తెలిసి జాకీ ఎంత స్టార్ అర్ధం చేసుకొని సోనీ వాళ్ళు ఆ నెక్స్ట్ డేనే వచ్చి వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. జాకీ ష్రాఫ్, అయేషా తో పాటు మరో అయిదుగురు కలిసి ఇండియాలో సోనీ టెలివిజన్ ని మొదలుపెట్టారు. అప్పుడు జాకీ ష్రాఫ్ ఇందులో పెట్టుబడి పెట్టింది కేవలం లక్ష రూపాయలు. దానికి తగ్గ షేర్లు సోనీ వీళ్లకు ఇచ్చింది.

అయితే 2010 సమయానికి జాకీ ష్రాఫ్ స్టార్ డమ్ పోయింది. హీరో కాస్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు. అప్పులు పెరిగాయి. ఆ సమయంలో15 ఏళ్ళ తర్వాత సోనీ ఎంటర్టైన్మెంట్ నుంచి జాకీ, అతని భార్య బయటకు వచ్చేసారు. అప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టిన డబ్బులకు వచ్చిన రిటర్న్స్ దాదాపు వంద కోట్లు. దెబ్బకి జాకీ తన అప్పులు తీర్చుకోవడమే కాక బాలీవుడ్ లో అప్పుడు ధనవంతుల లిస్ట్ లో జాయిన్ అయ్యాడు. అలా కేవలం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి 15 ఏళ్ళు ఛానల్ తో పనిచేసి వంద కోట్లు లాభం తీసుకున్నారు. ఈ విషయాలన్నీ అయేషా ష్రాఫ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం జాకీ ష్రాఫ్ ఆస్తుల విలువ 400 కోట్లు అని బాలీవుడ్ సమాచారం.

Also Read : RGV War 2 : ఎన్టీఆర్ సినిమాపై ఆర్జీవీ వ్యాఖ్యలు వైరల్.. లాజిక్ లేదు అంటూ..