Grilled Corn
Corn Benefits : మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొక్క జొన్నలో కావలసినన్ని లవణాలు లేదా మినరల్స్ వుంటాయి. పసుపు రంగులో వుండే ఈ గింజలలో మినరల్స్ అధికం. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి ఉంటాయి. మొక్క జొన్న కండెలను నిప్పులపై వేడిచేసి బాగా కాలిన తర్వాత తింటారు. మరికొందరు ఉడకబెట్టుకుని తింటారు. ఇంకొందరు పాప్ కార్నర్ రూపంలో తీసుకుంటారు. ఇటీవలి కాలంలో స్వీట్ కార్నర్ గా మొక్కజొన్నలకు బాగా ప్రాచుర్యం లభిస్తుంది. వీటిని తినేందుకు ఎక్కవ మంది ఆసక్తి చూపిస్తున్నారు.
మొక్క జొన్న గింజలు శరీరానికి బలం ఇస్తుంది. వీటిలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ E, B1, B6, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లావిన్ నియాసిన్‌లు ఉంటాయి. మొక్కజొన్నలో పీచు పదార్ధం పుష్కలంగా వుంటుంది. జీర్ణక్రియకు ఇది పనిచేస్తుంది. ఆహారంలో పీచు వుంటే అది మలబద్ధకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ నివారిస్తుంది.
మొక్క జొన్నలో ఉండే విటమిన్-C, యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ వల్ల జుట్టుకు కాంతివంతంగా ఉంటుంది. రోజూ తినేవారిలో హెయిర్ ఫోలీ సెల్స్ బలంగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్‌లు ఉంటాయి. దీని వల్ల ఎముకలు గట్టిపడతాయి. మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. బాగా ఎండిన మొక్కజొన్న విత్తనాల నూనెను చర్మానికి రాసుకోవచ్చు.
రక్తహీనతను అరికడతాయి. రక్తహీనత అంటే మీలోని ఎర్ర రక్త కణాల సంఖ్య ఐరన్ లేకపోవటం వలన గణనీయంగా పడిపోతుంది.మరి మీరు తినే స్వీట్ మొక్కజొన్న విటమిన్ బ మరియు ఫోలిక్ యాసిడ్ లు కలిగి మీలో రక్త హీనత లేకుండా చేస్తుంది. కొల్లెస్టరాల్ నివారణ చేస్తాయి. తీపి మొక్కజొన్నలో వుండే విటమిన్ సి, కేరోటియాయిడ్లు మరియు మయో ఫ్లేవినాయిడ్లు మీ గుండెను చెడు కొల్లెస్టరాల్ నుండి కాపాడుతాయి. శరీరంలో రక్తప్రసరణ అధికంచేస్తాయి.
మొక్క జొన్నలో వుండే ఫోలిక్ యాసిడ్ గర్భవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్ళు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. ఫోలిక్ యాసిడ్ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్క జొన్న తింటే, తల్లికి, బిడ్డకు ఆరోగ్యకరం. మొక్కజొన్న మధుమేహంతో బాధపడే వారికి మేలు చేస్తుంది. కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేకుండా దీన్ని తినొచ్చు.
మొక్కజొన్న కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మొక్కజొన్నలో అధిక ఫైబర్ ఉంటుంది. దీనిని తినేటప్పుడు, కడుపు ఎక్కువసేపు నిండి ఉంటుంది , దీని వల్ల అదనపు కేలరీలను తీసుకోలేము. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.