Wheat Roti : వాతాన్ని హరించే గోధుమ రొట్టెలు

పాత గోధుమలను ఒక రోజంతా నీటిలో నానబెట్టి తడి బట్టలో పోసి మూటకట్టాలి. అలా మూటకట్టిన గోధుమలు మొలకెత్తిన తరువాత ఎండబెట్టాలి.

Homemade Roti Chapati On Table .,

Wheat Roti : గోధుమ రొట్టెలు అతిరుచికరంగా ఉండటమే కాకుండా బలవర్ధకమైన ఆహారంగా చెప్పవచ్చు. శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి. వ్యాధినోరోధక శక్తిని అందించటంలో వీటిని మించిన ఆహారం మరొకటి లేదు. గోధుమల్లో పిండి పదార్ధాలు, ప్రొటీన్లు, పీచుపదార్ధాలు, ఐరన్, బి విటమిన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి.

పొట్టు తీయని గోధుమల్లో పీచు అధికంగా ఉండటంతో జీర్ణ క్రియ సాఫీగా ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజ్ పెరగదు. రాత్రి సమయంలో అన్నానికి బదులుగా గోధుమ రొట్టెలను తీసుకోవవటం డయాబెటిస్ తో బాధపడుతున్నవారికి ఎంతో మంచిది. గోధుమ రొట్టెలను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దానికి పెద్దగా శ్రమ పడాల్సిన పనిలేదు. గోధుమ రొట్టెలను తయారు చేసుకునేందుకు చేయాల్సిందన్నాలా…

పాత గోధుమలను ఒక రోజంతా నీటిలో నానబెట్టి తడి బట్టలో పోసి మూటకట్టాలి. అలా మూటకట్టిన గోధుమలు మొలకెత్తిన తరువాత ఎండబెట్టాలి. ఎండిన తరువాత నేయ్యితో దోరగా వేయించుకోవాలి. అనంతరం పిండిగా చేసుకోవాలి. ఈ పిండిని తగినంత తీసుకుని మంచి నీటితో కలిపి ముద్దగా చేసుకోవాలి. అనంతరం రొట్టెగా చేసుకుని పెనంపై కాల్చుకోవాలి. మలబద్దకం సమస్య ఉన్నవారు వంటాముదాన్ని వేసుకుని రొట్టెలను కాల్చుకోవచ్చు. లేకుంటే దేశవాళి ఆవునెయ్యిని రొట్టెలు కాల్చేందుకు వినియోగించుకోవచ్చు.

వేడి వేడిగా తయారు చేసుకున్నగోధుమ రొట్టెలను మెంతికూర, చుక్క కూర, తోట కూర, పొన్నగంటి కూర మొదలైన కూరలతో కలిపి తీసుకోవచ్చు. రొట్టెను చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని వేడిపాలల్లో కొంచెం చక్కర కలిపి వాటిలో రొట్టె ముక్కలు వేసి నానిన తరువాత తింటే బాగా రుచికరంగా ఉంటాయి.