Two Vaginas-Uteruses : ఈ యువతికి రెండు జననాంగాలు.. రెండు గర్భాశయాలు.. పైగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది!

ఈమెకు రెండు జననంగాలు ఉన్నాయి. అలాగే రెండు గర్భాశయాలు ఉన్నాయి. వైద్యులు ఈమెకు సంతానం అసాధ్యమని ఎప్పుడో తేల్చేశారు. అయినప్పటికీ ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. అది చూసిన వైద్యులే నివ్వెరపోయారు.

Woman with 2 vaginas and uteruses : ఈమెకు రెండు జననంగాలు ఉన్నాయి. అలాగే రెండు గర్భాశయాలు ఉన్నాయి. వైద్యులు ఈమెకు సంతానం అసాధ్యమని ఎప్పుడో తేల్చేశారు. అయినప్పటికీ ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. అది చూసిన వైద్యులే నివ్వెరపోయారు. వైద్య చరిత్రలోనే మిరాకల్ అంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన 31ఏళ్ల ఎవెలిన్‌కు పుట్టుకతోనే రెండు జననాంగాలు, రెండు గర్భాశయాలను కలిగి ఉంది. సాధారణంగా వింత శిశువులు పుట్టడం చూసి ఉంటాం.. కానీ, ఒక మహిళలో రెండు సంతానోత్పత్తి వ్యవస్థులు ఉండటం చాలా అరుదు. ఈ యువతికి 18ఏళ్లు వచ్చేంతవరకు తన శరీరంలో రెండు సంతానోత్పత్తి వ్యవస్థలు ఉన్నవిషయమే తెలియదట. నెలకు రెండు సార్లు పీరియడ్స్ కూడా వస్తుంటాయి. ప్రతి రెండు వారాలకు ఒకసారి పీరియడ్స్ వచ్చేవట. ఒకరోజు గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లిన క్రమంలో తనలో ఉన్న ఈ సమస్య బయటపడింది. మొదట్లో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టడం అసాధ్యమని వైద్యులు చెప్పేశారు. కొంచెం ఆందోళనకు గురైంది. కానీ, ఇప్పుడు గర్భం దాల్చాక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రెండు గర్భాశయాలు ఉండటం వల్ల ఆమెలో ప్రతి స్వంత ఫెలోపియన్ ట్యూబ్ అండాశయానికి దారితీస్తుంది.

3 వేల మంది మహిళల్లో ఒకరిలో ఈ అరుదైన సమస్య :
ఆమెకు ఒకే సమయంలో ఇద్దరు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఆమె అండాశయాలు ప్రతి నెలా గుడ్డును రిలీజ్ చేస్తాయా లేదా వైద్యులు వెల్లడించలేదు. ఆమె గర్భాశయంలో పిండం పెరగడానికి తగినంత స్థలం లేదని వైద్యులు గుర్తించారు. అందులోనూ ఎవెలిన్ భర్తకు తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉంది. దాంతో దంపతులు ఐవిఎఫ్‌ (IVF)ను ప్రయత్నించాలని సూచించారు. అలాగే ప్రీడెలివరీకి సిద్ధం కావాలని వైద్యులు సూచించారు. ఎవెలిన్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించగా సహజంగానే గర్భం దాల్చింది. కానీ, తన 20ఏటా అబార్షన్ అయింది. అప్పుడు వైద్యులు పిండాన్ని గుర్తించలేకపోయారు. మరోసారి పరీక్షించగా ఆమెకు రెండు గర్భాశయాలు ఉన్నాయని కనుగొన్నారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని వైద్యులు తెలిపారు. దీన్ని గర్భాశయం డిడెల్ఫిస్ (uterus didelphys)గా పిలుస్తారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 3వేల మంది మహిళలలో ఒకరిలో ఈ సమస్య ఉంటుందని తెలిపారు. రెండు గర్భాశయాలు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ సంతానోత్పత్తిపై ప్రభావితం ఉండదని అంటున్నారు. కానీ, గర్భస్రావం (miscarriage)తో పాటు ప్రీమెచ్యూర్ డెలివరీ, మావికి సంబంధించిన (placental complications) సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గర్భం దాల్చేందుకు ఎవెలిన్ దంపతులు ఆమె కుడి జననాంగం ద్వారా మాత్రమే ప్రయత్నించినట్టు  తెలిపారు. గర్భధారణ సమయంలో ఎవెలిన్ చాలావరకూ విశ్రాంతి తీసుకుంది. ప్రతి వారం వైద్యుల దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకుంది. అయితే ఆమె బంప్ ఒక వైపు మాత్రమే పెరగడాన్ని గుర్తించారు వైద్యులు. అందుకే ఎవిలెన్ సహజంగా బిడ్డకు జన్మనివ్వలేకపోయింది. ఎందుకంటే ఆమె ఎడమ, కుడి జననాంగాల మధ్య గోడ ఉంది. శిశువు అందులో చిక్కుకునే ప్రమాదం ఉంది.  37 వారాల తర్వాత ఆమె 5 పౌండ్లు (2.3 కిలోలు) బరువున్న ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం వైద్యులు ఎవెలిన్ రెండు గర్భశయాలను ఒకే దగ్గరకు లాగారు. ఆ తర్వాత కుట్లు వేసినట్టు వైద్యులు తెలిపారు. ఏడు వారాల వయస్సు ఉన్న ఎవెలిన్ శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు