Missing Meghana Review : ‘మిస్సింగ్ మేఘన’ రివ్యూ.. అమ్మాయి మిస్సింగ్ కేసు చివరకు ఎటు వెళ్లిందంటే..
Missing Meghana Movie Review : మిస్సింగ్ మేఘన అనే టైటిల్ తో ట్రయిలర్, టీజర్స్ తో ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్ అనే ఆసక్తి కలిగించారు.
- Saketh U
- Updated on- September 17, 2026 / 01:32 PM IST
Missing Meghana Movie Review
Missing Meghana Review : రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, కౌశిక్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో వాచస్పతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిస్సింగ్ మేఘన సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
బేకరీ నడుపుకునే మేఘన(అమ్ము అభిరామి) రాత్రి పూట ఇంకా ఇంటికి రాలేదని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు ఆమె తండ్రి శ్రీనివాసరావు(గోపరాజు రమణ). పోలీసులు పట్టించుకోకపోవడంతో మేఘనకు కాబోయే భర్త ACP అర్జున్(కౌశిక్) కి చెప్తాడు. దీంతో అర్జున్ రంగంలోకి దిగి విచారణ మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఓ బ్యాంక్ మేనేజర్, మరికొంతమందిని విచారిస్తాడు. మేఘనని చివరగా కార్తీక్(రామ్ కార్తీక్) అనే బైక్ రైడర్ డ్రాప్ చేసాడని తెలిసి అతన్ని విచారిస్తారు. అతను మేఘన ఎవరో తెలీదు అని ఆద్య(వైదిక సెంజాలియా)తో ఉన్న బ్రేకప్ స్టోరీ చెప్తాడు.
కానీ మేఘన కాల్ లిస్ట్ తెప్పిస్తే అందులో రైడర్ కార్తీక్ తోనే ఎక్కువ కాల్స్ మాట్లాడినట్టు ఉంటుంది. అదే సమయంలో మేఘనని గతంలో ఏడిపించిన కొంతమందిని విచారిస్తే కార్తీక్ ఆమె బాయ్ ఫ్రెండ్ అని చెప్తారు. అసలు కార్తీక్ – మేఘనకు సంబంధం ఏంటి? కార్తీక్ – ఆద్య ప్రేమకథ ఏంటి? అసలు మేఘన ఏమైంది? మేఘన దొరుకుతుందా? మేఘన మిస్సింగ్ వెనక ఉన్నది ఎవరు.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ..
మిస్సింగ్ మేఘన అనే టైటిల్ తో ట్రయిలర్, టీజర్స్ తో ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్ అనే ఆసక్తి కలిగించారు. ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ సీన్ లో మేఘన మిస్సింగ్ చూపించి పోలీస్ ఎంట్రీ, పలువురు విచారణతో సాగుతుంది. మధ్యలో ACP – ఇంకో పోలీస్ కి గొడవ, మేఘన తమ్ముడు వచ్చి ఆమె గురించి చెప్పడం, అనుమానం ఉన్నవాళ్ళని విచారించడంతో సాగుతుంది. కార్తీక్ ని తీసుకురావడం, అతని బ్రేకప్ కథతో నడిచి ఇంటర్వెల్ కి మాత్రం కార్తీక్ తో మేఘన రోజూ మాట్లాడుతుంది, వీళ్ళిద్దరూ లవర్స్ అనే ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్స్, డ్రగ్స్ కేసుగా మారుతుంది. విచారణలు, మర్డర్స్ తో సాగుతుంది. చివర్లో హీరో హీరోయిన్ కోసం పోరాటం అన్నట్టు నడుస్తుంది.
ఫస్ట్ హాఫ్ లో కూతురు మిస్ అయితే తండ్రి ఎమోషన్ చూపించటానికి ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి – కూతుళ్ళ మధ్య అనుబంధం కోసం ఒక సాంగ్ పెట్టారు. కానీ ఆ ఎమోషన్ పండలేదు, అసలు అక్కడ ఆ సాంగ్ అవసరం లేదు కూడా. ఇలాంటి సినిమాల్లో మెయిన్ విలన్ ఎవరు అనేది చివరి వరకు హోల్డ్ చేయగలగాలి. దానికి తగ్గ ఆర్టిస్ట్ ని పెట్టుకోవాలి. కానీ ఫస్ట్ హాఫ్ లోనే ఓ ఆర్టిస్ట్ ని చూపించడంతో అతనే విలన్ అని అందరికి అర్ధమయిపోయింది. ఎందుకంటే ఆ ఆర్టిస్ట్ గతంలో చేసిన సినిమాలు అలాంటివి. ఊహించినట్టే అతనే విలన్ అని క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు. ఇలాంటి ట్విస్ట్ కి ఆ ఆర్టిస్ట్ కరెక్ట్ కాదు. ప్రేక్షకులు ముందే పసిగట్టేసారు.
కార్తీక్ రొటీన్ బ్రేకప్ కథతో సాగదీశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ సాగదీసినా సెకండ్ హాఫ్ లో మాత్రం కథ కాస్త పరుగులు పెట్టించారు. మిస్సింగ్ కేసు కాస్త డ్రగ్స్ కేసుగా మారడం బాగానే రాసుకున్నారు కానీ అక్కడ కూడా విలన్ ఎవరు అనేది ఈజీగా గుర్తుపట్టేయొచ్చు. మధ్యలో కొంతమంది చనిపోవడంతో పోలీసులు, హీరో విలన్ ని ఎలా పట్టుకుంటారు, మేఘన ఎక్కడున్నది ఎలా కనుక్కున్నారు అనేది బాగానే రాసుకున్నారు. ఒక్క మెయిన్ విలన్ ఆర్టిస్ట్ మార్చుకొని ఉంటె సెకండ్ హాఫ్ ఇంకా బాగా పండేది. క్లైమాక్స్ రొటీన్ యాక్షన్ సీన్ హీరోయిన్ ని హీరో కాపాడే సీన్ తోనే ముగించారు. సెకండ్ హాఫ్ లో కార్తీక్ – మేఘన పరిచయం, వాళ్ళ మధ్య స్నేహం కూడా గతంలో కొన్ని సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఉన్నాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్..
మేఘన పాత్రలో అమ్ము అభిరామి క్యూట్ గా కనిపించి బాగా నటించింది. అగ్రెసివ్ పోలీస్ పాత్రలో కౌశిక్ బాగానే మెప్పించాడు. రామ్ కార్తీక్ లవ్ ఫెయిల్యూర్ పాత్రలో, మరో అమ్మాయికి దగ్గరయ్యే పాత్రలో బాగానే నటించి చివర్లో యాక్షన్ కూడా చేసాడు. అంకిత్ కొయ్య తన పాత్రలో బాగానే నటించాడు. గోపరాజు రమణ తండ్రి పాత్రలో పర్వాలేదు అనిపించారు. వెంప కాశి, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, షాని, పండు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Kirrak RP : బ్రహ్మానందంతో కిరాక్ ఆర్పీ ఫ్యామిలీ.. కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్ లో కలర్ గ్రేడింగ్ చేయలేదు అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా సెట్ అవ్వలేదు. పాటలు బాగున్నాయి. రీ రికార్డింగ్,మిక్సింగ్ సరిగా చేయలేదు అనిపిస్తుంది. అమ్మాయి మిసింగ్ నేపథ్యంలో లవ్ స్టోరీ, క్రైమ్ బాగానే రాసుకున్నా సాంకేతికంగా ఇంకాస్త బెటర్ అవుట్ ఫుట్ ఇవ్వాల్సింది దర్శకుడు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో ఓ సాంగ్, కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘మిస్సింగ్ మేఘన’ సినిమా ఓ అమ్మాయి కిడ్నాప్ తో మొదలయి ప్రేమ కథ, మర్డర్స్, డ్రగ్స్ అంటూ సాగుతుంది. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
