Panchali Panchabhartruka Review : ‘పాంచాలి పంచభర్తృక’ మూవీ రివ్యూ.. రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాతో నవ్వించారా?

పాంచాలి పంచభర్తృక టైటిల్ క్రేజీగా ఉండటం, రాజేంద్రప్రసాద్ ఫుల్ కామెడీ సినిమాతో రావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. (Panchali Panchabhartruka Review)

  • Published on- August 14, 2026 / 11:57 PM IST

Panchali Panchabhartruka Review

Panchali Panchabhartruka Review : రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘పాంచాలి పంచభర్తృక’. సరీ ఫర్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి, పృథ్వీ, బాల, సునీత.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్‌, ఓం సాయిరాం ఆర్ట్స్‌ బ్యానర్లపై వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్ నిర్మాణంలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పాంచాలి పంచభర్తృక సినిమా నేడు ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే..

డాక్టర్ దమయంతిని డాన్‌సన్ మనుషులు ఎత్తుకెళ్ళి చంపేస్తామని బెదిరించి తమ బిజినెస్‌లో సహకరించేలా ఒప్పిస్తారు. మరోవైపు సీరియల్స్ తీసుకునే చిత్తరంజన్ (జెమిని సురేష్‌)కు సినిమా తీయాలని కోరిక. దాని కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న కాట్‌రాజ్, పుష్పరాజ్ లను చిత్తరంజన్ తన పెంట్ హౌస్‌లో ఉండమని చెప్పి వాళ్ళ ముగ్గురితో పాటు అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ బాబ్జీ కలిసి నలుగురూ క్లోజ్ అవుతారు. ఒకరోజు ఒక అమ్మాయిని తెచ్చుకోవాలని ప్లాన్ చేసి సెనోరిటా(సరీ ఫర్)ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటారు.

ఆమె వచ్చిన తర్వాత నలుగురూ ఓ పని మీద బయటకు వెళ్లి వచ్చేసరికి సెనోరిటా చనిపోయి ఉంటుంది. దాంతో భయపడి ఆ శవాన్ని మాయం చేద్దామని సూట్‌కేసులో పెడితే ఆ సూట్‌కేసు కూడా మాయమవుతుంది. అసలు సెనోరిటా ఎలా చనిపోయింది? ఆమె శవం ఎవరు తీసుకెళ్లారు? డాక్టర్ దమయంతి కథేంటి? ఈ మధ్యలో పరమసుందరి (రాజేంద్ర ప్రసాద్)ఎవరు? రోజ్‌మేరి పాత్ర ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Pallaburusu Review : ‘పళ్ళ బురుసు’ రివ్యూ.. కొడుకుపై కేసు పెట్టిన ముసలి తండ్రి కథ..

సినిమా విశ్లేషణ..

పాంచాలి పంచభర్తృక టైటిల్ క్రేజీగా ఉండటం, రాజేంద్రప్రసాద్ ఫుల్ కామెడీ సినిమాతో రావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. కమెడియన్ సునీల్ వాయిస్ ఓవర్ తో పాత్రలు పరిచయం కొత్తగా ఉంటుంది. పాత్రల పరిచయం వెరైటీగా, పాత్రల పేర్లు ఆసక్తికరంగా ఉంటాయి. నలుగురు వ్యక్తులు కలిసి అమ్మాయిని తెచ్చుకోవడం, ఆమె అనుకోకుండా చనిపోవడం అనే కథ పాతదే అయినా ఆమెను ఎవరు చంపేశారు అనేది లాస్ట్ వరకు గెస్ చేయలేని కొత్త కథనంతో ఆసక్తిగా రాసుకున్నారు.

ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయంతో కొంచెం సాగదీశారు. ఆ తర్వాత కొన్ని కామెడీ సన్నివేశాలు పెట్టినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సెనోరిటా చనిపోయిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా నడుస్తుంది. ఆ తర్వాత వచ్చే సస్పెన్స్ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఇక సెకండ్ హాఫ్ లో ట్విస్టులు రివీల్ చేస్తూ ఏం జరిగింది? ఎవరు చేసారు అనే క్లారిటీ ఇస్తూ ఆసక్తిగా సాగుతుంది. చివర్లో ట్విస్టులు బాగున్నాయి. మొదట్లో కొంత సాగదీసినా ఆ తర్వాత కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమాని తెరకెక్కించారు. అయితే టైటిల్ కి సినిమా కథకు సంబంధం ఏంటో దర్శకుడికే తెలియాలి. పాంచాలి పంచభర్తృక అనే టైటిల్ ని ఇలా కామెడీ సినిమాకు వాడటం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..

రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ పృధ్వీలు చాలా బాగా నటించి నవ్వించారు. జెమినీ సురేష్‌ బాగానే మెప్పించారు. చాన్నాళ్లకు రోల్ రైడాకు ఫుల్ లెంగ్త్ పాత్ర దక్కింది. సరీహ్ ఫార్, రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి, సునీత మనోహర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also See : Anna Konidela : మొదటిసారి పిఠాపురానికి పవన్ కళ్యాణ్ భార్య.. ట్రైన్‌లో వెళ్లి పూజలు చేసి.. అన్నా కొణిదెల ఫొటోలు వైరల్..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. టైటిల్ సాంగ్ బాగున్నా మిగిలిన పాటలు మాత్రం అంతగా మెప్పించవు. పాత కథే అయినా కొత్త కథనంతో సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీగా బాగానే రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా పాంచాలి పంచభర్తృక ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.