2023 Top 10 Telugu Highest Gross Collection Movies List
Telugu Movie Collections : 2023 టాలీవుడ్ కి బాగానే కలిసి వచ్చింది. ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. కమర్షియాలు సినిమాలు కూడా వచ్చి సూపర్ హిట్ కొట్టాయి. కొంతమందిని నిరాశ పరిచినా ఈ సంవత్సరం చాలా సినిమాలు మంచి విజయాలను చూశాయి. ఇక కలెక్షన్స్ పరంగా కుడా ఈ సంవత్సరం 100 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. 2023 లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాల వివరాలు ఇవే..
ఇటీవల రిలీజయిన ప్రభాస్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ సినిమా ఇప్పటికే 550 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఈ ఇయర్ తెలుగు సినిమాల్లో టాప్ లో ఉంది. సలార్ సినిమాకి ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.
ఆ తర్వాత చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 236 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమా 134 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.
ధనుష్ సర్ సినిమా దాదాపు 118 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో తెలుగు డైరెక్టర్, నిర్మాతలతో తెరకెక్కింది.
నాని ‘దసరా’ సినిమా 115 కోట్లు కలెక్ట్ చేసింది.
బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమా 110 కోట్లు కలెక్ట్ చేసింది.
సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ 103 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
ఆనంద్, వైష్ణవి, విరాజ్ ‘బేబీ’ సినిమా 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వరకు వసూలు చేసింది.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ సినిమా 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.
విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ సినిమా 76 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
గమనిక : ఈ సమాచారం, లెక్కలు కేవలం ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా ఆధారంగా మాత్రమే ఇవ్వబడినవి.