2024 Sankranthi Releases : 2024 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ ఫైట్..

టాలీవుడ్ లో రానున్న రోజుల్లో చాలా పెద్ద సినిమా రిలీజ్ లే ఉన్నాయి. వాటిలో మూడు సినిమాలు అల్లు అర్జున్ 'పుష్ప-2', ప్రభాస్ 'ప్రాజెక్ట్-K', రామ్ చరణ్ 'RC15'. ఈ చిత్రాలు పై ఆడియన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకుంది. అయితే ఈ మూడు చిత్రాలు ఒకే టైంలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.

2024 Sankranthi Releases

2024 Sankranthi Releases : టాలీవుడ్ లో రానున్న రోజుల్లో చాలా పెద్ద సినిమా రిలీజ్ లే ఉన్నాయి. వాటిలో మూడు సినిమాలు అల్లు అర్జున్ ‘పుష్ప-2’, ప్రభాస్ ‘ప్రాజెక్ట్-K’, రామ్ చరణ్ ‘RC15’. ఈ చిత్రాలు పై ఆడియన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకుంది. అయితే ఈ మూడు చిత్రాలు ఒకే టైంలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Varun Tej – Lavanya Tripathi : వరుణ్‌పై మనసు పారేసుకున్న అందాల రాక్షసి.. ప్రేమ వార్త నిజమేనా?

ఇప్పటికే ప్రభాస్ అధికారికంగా సంక్రాంతి బరిలో చోటు కన్‌ఫార్మ్ చేసుకున్నాడు. ప్రాజెక్ట్-K చిత్రాన్ని 2024 జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అనౌన్స్ చేశాడు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణె, దిశా పటాని నటిస్తున్నారు. ఇక 2021 డిసెంబర్ లో ఒక రీజినల్ సినిమాగా విడుదలయ్యి పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న చిత్రం పుష్ప.. ఈ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

దాదాపు ఏడాది గ్యాప్ తరువాత ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో హిట్స్ అందుకున్న మైత్రి మూవీ మేకర్స్.. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో నిలిపేందుకు ఆలోచిస్తున్నారట. అయితే దీని పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అలాగే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ పొలిటికల్ డ్రామాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి దిల్ రాజు నిర్ణయం తీసుకున్నాడని ఇటీవల వార్తలు వినిపించాయి. చరణ్ బర్త్ డే రోజున టైటిల్ అనౌన్స్‌మెంట్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించనున్నాడట. ఒకవేళ ఈ మూడు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ ఫైట్ ఉండడం ఖాయం. మరి ఈ వార్తలు నిజామా? కదా? తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.