Viral Video : ‘3 ఇడియట్స్’ మూవీ సీన్ రియల్ లైఫ్‌లో.. తాతని బైక్ మీద హాస్పిటల్‌లోకి.. వైరల్ అవుతున్న వీడియో..

'3 ఇడియట్స్' మూవీలో తాతని బైక్ మీద హాస్పిటల్‌లోకి తీసుకెళ్లే సీన్ ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగింది.

Viral Video : ‘3 ఇడియట్స్’ మూవీ సీన్ రియల్ లైఫ్‌లో.. తాతని బైక్ మీద హాస్పిటల్‌లోకి.. వైరల్ అవుతున్న వీడియో..

3 Idiots Movie Scene happened in Real Life Video goes Viral

Viral Video : హిందీలో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 3 ఇడియట్స్(3 Idiots) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే సినిమా తమిళ్ – తెలుగులో విజయ్ తో స్నేహితుడు అనే టైటిల్ తో తీశారు. ఈ రెండు సినిమాల్లోనూ ఒక సీన్ ఉంటుంది. హీరో ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి సడెన్ గా అస్వస్థతకి గురైతే హీరో బైక్ మీద కూర్చోపెట్టుకొని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. డైరెక్ట్ హాస్పిటల్ లోపలి తీసుకెళ్లి జాయిన్ చేస్తాడు. ఆ సీన్ మొదట చూడటానికి కామెడీగా ఉన్నా, అలా చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చినందుకే బతికాడు అంటూ తర్వాత ఎమోషన్ చూపిస్తారు.

Also Read : Oy Movie : ‘ఓయ్’ టైటిల్‌లోనే ఇంత కథ ఉందా? ఓయ్ సినిమాకి అల్లు అర్జున్ కి సంబంధం ఏంటి?

ఇప్పుడు ఇదే సీన్ రియల్ గా జరిగింది. మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లా ఆసుపత్రికి ఓ వ్యక్తి తన తాతయ్యని బైక్ పై తీసుకొచ్చాడు. ఎమెర్జెన్సీ అంటూ హాస్పిటల్ లోపలికి తీసుకొచ్చి జాయిన్ చేసాడు. అనంతరం బైక్ బయట పార్కింగ్ చేసి మళ్ళీ హాస్పిటల్ కి వచ్చాడు. ప్రస్తుతం ఆ పెద్దాయనకు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. తన తాతయ్యని అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా ఇలా తీసుకొచ్చి కాపాడినందుకు నెటిజన్లు అతన్ని అభినందిస్తున్నారు.