Oy Movie : ‘ఓయ్’ టైటిల్‌లోనే ఇంత కథ ఉందా? ఓయ్ సినిమాకి అల్లు అర్జున్ కి సంబంధం ఏంటి?

ఓయ్ డైరెక్టర్ ఆనంద్ రంగ తాజాగా ఓయ్ సినిమా గురించి ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.

Oy Movie : ‘ఓయ్’ టైటిల్‌లోనే ఇంత కథ ఉందా? ఓయ్ సినిమాకి అల్లు అర్జున్ కి సంబంధం ఏంటి?

Director Anand Ranga Detailing about Oy Movie Title and Oy Movie Title related to Allu Arjun

Updated On : February 13, 2024 / 11:52 AM IST

Oy Movie : సిద్దార్థ్(Siddharth), షామిలి జంటగా ఆనంద్ రంగ దర్శకత్వంలో 2009లో వచ్చిన సినిమా ‘ఓయ్’. ఈ సినిమా మ్యూజికల్ గా, కథ పరంగా ప్రేక్షకులని ఆకట్టుకున్నా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఓయ్ సినిమాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికి ఓయ్ పాటలు వింటూనే ఉంటారు. సినిమా రిలీజయిన 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వాలెంటైన్స్ డేకి ఈ ఫిబ్రవరి 14న ఓయ్ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.

దీంతో ఓయ్ డైరెక్టర్ ఆనంద్ రంగ(Anand Ranga) గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఓయ్ సినిమా గురించి పోస్టులు పెడుతూ, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు. తాజాగా ఓయ్ సినిమా గురించి ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో ఓయ్ సినిమా గురించి డీటైలింగ్ ఇచ్చాడు. సాధారణంగా ఓయ్ ఇంగ్లీష్ లో రాయాలంటే Oye అని రాస్తాము కానీ ఈ సినిమాకి టైటిల్ లో Oy అని మాత్రమే ఉంటుంది.

ఆనంద్ రంగ తన పోస్ట్ లో.. ఓయ్ సినిమా ఫిబ్రవరి 14కి రీ రిలీజ్ అవుతుంది. ఎవరైనా రివ్యూయర్ ఈ సినిమాలో ఒక స్మాల్ డీటైలింగ్ ని గమనించారా? నేను చెప్తాను ఓయ్ గురించి. నేను ఈ స్క్రిప్ట్ సొంతంగా రాసుకున్నాను. సినిమాలో సంధ్య.. ఉదయ్ ని ఓయ్ అని పిలుస్తుంది. సాధారణంగా ఇలా బయట చాలా మంది పిలుస్తారు. ఈ సినిమాలో ఉదయ్ లవ్ స్టోరీ తన బర్త్ డే రోజు 1 జనవరి 2007న సంధ్యని చూడటంతో మొదలవుతుంది. ఆ తర్వాత సంక్రాంతికి ఉదయ్ తండ్రి చనిపోతాడు. సంధ్య వాలెంటైన్ డే రోజు గులాబీలతో మాట్లాడుతుంది. ఆ తర్వాత సినిమాలో ఒక హోలీ సీక్వెన్స్ వస్తుంది. ఆ తర్వాత సమ్మర్ వెకేషన్ కి పిల్లలు సంధ్య దగ్గరికి వస్తారు. షిప్ లో వినాయక చవితి ఎపిసోడ్ ఉంటుంది. తర్వాత సంధ్య ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. మళ్ళీ సంవత్సరానికి 1 జనవరి 2008కి సంధ్య చనిపోతుంది. ఉదయ్ ప్రేమ కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. 2007 జనవరి 1 మొదలయి 2008 జనవరి 1కి ముగుస్తుంది. one year షార్ట్ కట్ లో oy అని టైటిల్ పెట్టాను అని తెలిపాడు. దీంతో అంత చిన్న టైటిల్ లో ఇంత పెద్ద కథ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

Also Read : SSMB 29 : రాజమౌళి – మహేష్ బాబు సినిమా టెక్నిషియన్స్ వీళ్లేనా? బాబు కోసం తన టీంలో ఛేంజెస్ చేసిన రాజమౌళి?

అలాగే ఈ టైటిల్ గురించి చెప్తూ.. మొదట ఈ ఓయ్ టైటిల్ ని అల్లు అర్జున్(Allu Arjun) పరుగు సినిమాకి పెట్టమని చెప్పాను. పరుగు సినిమాలో హీరో – హీరోయిన్స్ కి వచ్చే కొన్ని సీన్స్ లో హీరో ఓయ్ అని పిలుస్తాడు. కానీ ఆ టైటిల్ తీసుకోలేదు. తర్వాత ఆ టైటిల్ తో నేను కథ రాసుకున్నాను అని తెలిపాడు. దీంతో ఆనంద్ రంగ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.