బాలీవుడ్ స్టార్ హీర్ షారూఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్.. ‘చెన్నై ఎక్స్ప్రెస్’.. 2013 ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా 2020 ఆగస్టు 10 నాటికి ఏడేళ్లు పూర్తవుతోంది.
రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రం పలు రికార్డులను కూడా బద్దలుకొట్టింది. ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ నటి దీపికా పదుకొనే కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్చేశారు….
దీపికా, షారుఖ్ల నటన, కామెడీ టైమింగ్ సినిమాకు మెయిన్ ప్లస్ అని చెప్పాలి. సత్యరాజ్, నిఖిత్ ధీర్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలోని లుంగీ డాన్స్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రియమణి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా హిందీ పరిశ్రమకు పరిచయమైంది.